ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. దీంతో ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు(రేపు, ఎల్లుండి) వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారత వాతావరణ కేంద్రం(IMD)సూచనలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కె కన్నబాబు విడుదల చేశారు. రానున్న రెండు రోజుల పాటు అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. సోమవారం(07-12-20202) రోజున.. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
ఇక, మంగళవారం(08-12-2020) రోజున.. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
ఇక, ఇప్పటికే నివర్ తుపాన్ ప్రభావంతో దక్షిణ కోస్తాతో జిల్లాలతో పాటుగా చిత్తూరు, కడప జిల్లాలకు భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి వర్షాలు కురువనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.