ANDHRA PRADESH WEATHER REPORTS COMING THREE DAYS CHANCE TO HEAVY RAINS IN SOME AREAS NGS VSP
AP Weather: రాగల మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక.. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు..!
ప్రతీకాత్మకచిత్రం
తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాగల మూడు రోజుల్లో ఏపీలో పలు చోట్ల.. తెలంగాణలో ఒకటి రెండు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఇప్పటికే ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతలు, ఏజెన్సీల్లో కుండపోత వాన దంచి కొడుతోంది. ఇదే సమయంలో అల్పపీడన ద్రోణి బలహీన పడిందని, దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం వాతావరణం కేంద్రం
హెచ్చరిస్తోంది. అయితే రుతుపవనాలు ఉత్తరభారత దేశాన్ని దాటలేకపోతున్నాయని.. ఇటు పశ్చిమ ప్రాంతాలకు వ్యాంపించడం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడమే అందుకు కారణమంటున్నారు. దీంతో రాజస్థాన్, ఢిల్లీ, యూపీ, పశ్చిమ ప్రాంతాలు, చండీఘడ్, హర్యాన రాష్ట్రాలకు వర్షాకాలం మొదలవ్వలేదు అంటున్నార. ఈ పరిస్థితి మరో ఐదు రోజులు ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయన్నారు. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజులకు సంబంధించి వాతావరణ నివేదికను అధికారులు ప్రకటించారు. ఈ రిపోర్ట్స్ ప్రకారం.. ఇవాళ, రేపు ఉత్తరకోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే మంగళవారం ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రాలో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మంగళవారం నాడు దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాయలసీమ ప్రాంతంలోనూ ఇంచుమించు ఇదేమాదిరిగా వాతావరణ పరిస్థితులు ఉంటాయన్నారు. ఈరోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. మంగళవారం నాడు మాత్రం ఉరుములు, మెరుపులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల కురుస్తాయని వెల్లడించారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.