ఏపీలో రేపటి నుంచి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఈ రోజు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

AP Rains | ఆంధ్ర ప్రదేశ్ మీద తక్కువ స్థాయిలలో విండ్ కన్వర్జెన్స్ ప్రభావం ఉంటుంది. దక్షిణ ద్వీపకల్ప ప్రాంతం మీద ఉపరితల ద్రోణి ప్రభావము చురుకుగా ఉంటుంది.

  • Share this:
    ఆగ్నేయ ఉత్తర ప్రదేశ్ నుండి దక్షిణ చత్తీస్ గఢ్ వరకు 5.8 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉత్తర-దక్షిణ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ మీద తక్కువ స్థాయిలలో విండ్ కన్వర్జెన్స్ ప్రభావం ఉంటుంది. దక్షిణ ద్వీపకల్ప ప్రాంతం మీద ఉపరితల ద్రోణి ప్రభావము చురుకుగా ఉంటుంది.

    ఉత్తర కోస్తాంధ్ర, యానాం :
    ఈ రోజు ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

    దక్షిణ కోస్తా ఆంధ్ర :
    ఈరోజు ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

    రాయలసీమ :
    ఈ రోజు ఉరుములు, మెరుపులుతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులుతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: