హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Weather Alert: నెల్లూరు.. తిరుమలలో కుండపోత.. మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వానలు

Weather Alert: నెల్లూరు.. తిరుమలలో కుండపోత.. మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వానలు

ఆ వరద కష్టాలు తీరేది ఎప్పుడు అని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులకు, ప్రభుత్వం తమను పట్టించుకోవాలని వేడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయి అనే హెచ్చరికలు కలవర పాటుకు గురి చేస్తున్నాయి. అయితే సీమ జిల్లాలతో పాటు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ సూచిస్తోంది.

ఆ వరద కష్టాలు తీరేది ఎప్పుడు అని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులకు, ప్రభుత్వం తమను పట్టించుకోవాలని వేడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయి అనే హెచ్చరికలు కలవర పాటుకు గురి చేస్తున్నాయి. అయితే సీమ జిల్లాలతో పాటు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ సూచిస్తోంది.

Heavy Rains in Andhra Pradesh: వర్షకాలం వెళ్లిపోతున్నా.. వానలు మాత్రం ఆంధ్రప్రదేశ్ ను ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ఇంకా చదవండి ...

Andhra Pradesh Weather Report:   తెలుగు రాష్ట్రాల (Telugu States)ను భారీ వానలు ముంచెతుత్తున్నాయి. మరోవైపు నేటి నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు  (Heavy Rains) పడే అవకాశం ఉంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో కుండపోత వానకు అవకాశం ఉంది. ప్రస్తుతం బంగాళా ఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం..తమిళనాడు తీరానికి దగ్గరగా శ్రీలంక ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా గాలులతో 3. కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తేలికపాటి వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా 3, 4 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీనికి తోడు మళ్లీ ఈ నెల ఆరవ తేదీన మరో అల్పపీడనానికి అవకాశం ఉంది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో ఆదివారం రాత్రి నుంచి తెలంగాణ (Telangana) లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని జటప్రోలులో 5.2 సెంటీమీటర్లు, మహబూబ్‌నగర్‌లోని అయ్యగారిపల్లెలో 4.3 సెంటీమీటర్లు, వనపర్తిలో 3 సెంటీమీటర్ల వర్షం పడింది. ఈ అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) పై కూడా ఉండనుంది.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవగా, నెల్లూరు, తిరుమలలో కుండపోతగా కురిశాయి. నెల్లూరులో.. గంటపాటు ఆగకుండా వాన పడటంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. నగరంలోని నర్తకి, కనకమహల్, గాంధీబొమ్మ, వీ ఆర్ సి, ముత్తుకూరు బస్టాండ్, హరనాథపురం సెంటర్లలో రోడ్లపైకి వర్షపునీరు వచ్చేయటంతో పాదచారులు, వాహన చోదకులు అవస్థలు పడ్డారు. అయితే, ఎండవేడి, ఉక్కపోతతో అల్లాడి పోతున్న జనం వర్షాలతో వాతావరణం చల్లబడి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఏపీలో మళ్లీ ఎన్నికల హీట్.. షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం.. వివరాలివే

ఇక తిరుమలలో.. శ్రీవారి దర్శనానికి వైకుంఠం కాంప్లెక్స్‌కు వెళ్లే భక్తులతో పాటుగా దర్శనం తర్వాత బయటకు వచ్చే భక్తులు తడిసిముద్దయిపోతున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాఢ వీధులు, లడ్డూ వితరణ కేంద్రాల్లో వర్షపు నీరు భారీగా చేరుకోవడంతో వర్షపు నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు టిటిడి సిబ్బంది.

ఇదీ చదవండి: ఉల్లాసంగా ఉత్సాహంగా ఉప రాష్ట్రపతి మార్నింగ్ వాక్.. ఈ వయసులో ఫిట్ నెస్ సీక్రెట్ అదే..

మరోవైపు తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండడంతో, మొదటి, రెండవ ఘాట్ రోడ్డులలో ప్రయాణించే ప్రయాణికులను అప్రమత్తం చేస్తోంది టిటిడి విజిలెన్స్. కాగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు వరకూ విస్తరించడంతో ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే.

First published:

Tags: Andhra Pradesh, AP News, Heavy Rains, Nellore, Rains, Tirupati

ఉత్తమ కథలు