AP Weather Report | ఏపీలో ఈ మూడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే చాన్స్..

ప్రతీకాత్మక చిత్రం

AP Weather Forecast | ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఈ రోజు ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.

  • Share this:
    శ్రీలంక తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో 1.5 కి.మీ నుంచి 2.1 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఉత్తర మధ్య కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఈ రోజు ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

    దక్షిణ కోస్తాంధ్రలో ఈ రోజు ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణకోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

    రాయలసీమలో ఈ రోజు ఉరుములు, మెరుపులు తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: