Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH WEATHER FORECAST NORTH COASTAL ANDHRA LIKELY TO WITNESS HEAVY RAINS BA

AP Rains: ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP Weather Report: ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

    దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాలలో 3.1 కి.మీ నుంచి 4.5 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కోస్తాంధ్ర - ఉత్తర తమిళనాడు కోస్తా ప్రాంతాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 2.1 కి.మీ ఎత్తు వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఈరోజు ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Heavy Rains, WEATHER

    తదుపరి వార్తలు