AP Weather Report | వర్షాలపై ఏపీ ప్రజలకు ఉపశమనం

AP Rains Alert | ఏపీ వ్యాప్తంగా వచ్చే మూడు రోజులు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.

news18-telugu
Updated: August 18, 2020, 5:45 PM IST
AP Weather Report | వర్షాలపై ఏపీ ప్రజలకు ఉపశమనం
Rain Alert : ఏపీకి మోస్తరు వర్షసూచన
  • Share this:
Andhra Pradesh weather update | తూర్పు-పశ్చిమ shear zone Lat.20.0 deg.N వెంబడి మధ్య భారత్ మీదుగా 4.5 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళే కొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో సుమారుగా ఆగస్టు 19 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తదుపరి 24 గంటలలో మరింత బలపడి క్రమంగా పడమర వైపుకు కదిలే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాంలో ఈ రోజు రేపు, ఎల్లుండి, తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా కురిసిన వర్షాలతో పాటు ఎగువన కూడా భారీ వర్షాలు పడడంతో గోదావరి నదికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీగా వరద ప్రవాహం వచ్చింది. తెలంగాణలో భద్రాచలం, ఏపీలో రాజమండ్రి వద్ద వరద పోటెత్తుతోంది. గోదావరి ఒడ్డున ఉండే లంక జిల్లాలు, పట్టణాల ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద బాధితులను ఆదుకోవాలని ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఎప్పటికప్పుడు సహాయకచర్యలను పర్యవేక్షించాలన్నారు. బాధితులకు వరద సమయంలో ఇచ్చే సాయంతో పాటు అదనంగా రూ.2000 ఆర్థికసాయం చేయాలన్నారు.

వరద తగ్గిన తర్వాత మరో పోరాటం చేయాల్సి ఉంటుందని సీఎం జగన్ అన్నారు. వరద తగ్గుముఖం పట్టగానే ముమ్మరంగా పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని ఆదేశించారు. తాగునీటిని క్లోరినేషన్‌ చేయాలని, అన్ని చోట్ల పారిశుద్ధ్యం లాంటి పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, వైద్య ఆరోగ్య శిబిరాలు కూడా నిర్వహించాలని, లేని పక్షంలో రోగాలు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. వరద తగ్గుముఖం పట్టగానే 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలని, ఆ మేరకు ఎన్యుమరేషన్‌ 10 రోజుల్లోగా చేయాలని, విద్యుత్, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 18, 2020, 5:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading