హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీలో అతి భారీ వర్షాలు... 4 రోజుల వెదర్ రిపోర్ట్...

ఏపీలో అతి భారీ వర్షాలు... 4 రోజుల వెదర్ రిపోర్ట్...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది.

    వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రాగల 4 రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అలలు 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తున ఎగిసిపడే అవకాశం ఉందని తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తుల శాఖ కమిషనర్ చెప్పారు.

    రాగల 4 రోజుల వాతావరణ వివరాలు

    ఆగష్టు 13 :- విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

    ఆగష్టు 14 :- విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

    ఆగష్టు 15 :- విశాఖ, తూర్పు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం.

    ఆగష్టు 16 :- విశాఖ, తూర్పు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Rain alert, WEATHER

    ఉత్తమ కథలు