పేదలకు ఇళ్లపై జగన్ ప్రభుత్వం కొత్త రూల్స్... వెంటనే అప్లై చెయ్యండి

Andhra Pradesh : పేదలందరికీ ఇళ్లు ఉండాలన్నది వైసీపీ ప్రభుత్వ ఆలోచన. అందుకు ఏం చెయ్యాలో కొత్త రూల్స్ జారీ చేసింది సర్కార్.

news18-telugu
Updated: December 3, 2019, 5:31 AM IST
పేదలకు ఇళ్లపై జగన్ ప్రభుత్వం కొత్త రూల్స్... వెంటనే అప్లై చెయ్యండి
ఏపీ సీఎం జగన్
  • Share this:
Andhra Pradesh : ఏపీలో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన నవరత్నాల్లో భాగమైన కీలక పథకం పేదలందరికీ ఇళ్లు. దీని సాధ్యాసాధ్యాలకు సంబంధించి సర్కార్ కొత్త రూల్స్ జారీ చేసింది. వాటి ప్రకారం... పట్టణాల్లో పేదవాళ్లకు ఒక సెంటు భూమిని ఇవ్వాలని డిసైడైంది. ఈ ప్రకారం వచ్చే ఏడాది ఉగాది వచ్చేసరికి 25 లక్షల మంది పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పట్టణాల్లో ఒక సెంటు భూమి ఇచ్చే విధానం వల్ల... ఎకరం స్థలంలో మొత్తం 55 మందికి ఇళ్ల స్థలం ఇచ్చినట్లవుతుంది. ఐతే... అన్ని చోట్లా భూమి దొరకదు కదా. అలాంటప్పుడు... జీ+3 (గ్రౌండ్ ఫ్లోర్ + 3 అంతస్థులు) విధానంలో అపార్ట్‌మెంట్లు నిర్మించి... ఫ్లాట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ స్కీం ఏ కుటుంబానికైనా జీవితంలో ఒక్కసారే వర్తిస్తుంది. కాబట్టి... ఈ స్కీం పొందాలనుకునేవారు... తాము పేదలం అని నిరూపించుకునేందుకు... రేషన్ కార్డును జిరాక్సును ఫ్రూఫ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఐతే... రేషన్ కార్డు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్లు పేదవాళ్లం అని నిరూపిస్తూ... ఆదాయ ధ్రువీకరణ పత్రం జిరాక్స్‌ను మీసేవ కేంద్రాల ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది.

ఏపీలో చాలా మంది అక్రమంగా ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్నారు. వాళ్లలో 90 శాతం మంది పేదలే. అలాంటి వాళ్లకు ప్రభుత్వం కొత్తగా స్థలాలు కేటాయించి... ఆల్రెడీ ఉన్న స్థలం నుంచీ ఖాళీ చేయించనుంది. ఇందుకు సంబంధించి తహసీల్దార్లు తమ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న భూముల వివరాల్ని ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఖాళీ భూముల్ని ఇచ్చేటప్పుడు ఆ లబ్దిదారుల ఆధార్ నంబర్, రేషన్ కార్డ్ వివరాల్ని లింక్ చేస్తారు. కాబట్టి అక్రమాలు జరిగే అవకాశాలు ఛాన్స్ ఉండదని ప్రభుత్వం అంటోంది. మరి స్టాంప్ పేపర్, ల్యామినేషన్ ఛార్జీల కింద రూ.20 ఇవ్వాలి. అలాగే... భూమి వచ్చాక... ఐదేళ్ల పాటూ దాన్ని అమ్మడానికి వీల్లేదు. ఆ తర్వాత వాళ్ల ఇష్టం. అమ్మేసుకోవచ్చు. ఇందుకోసం NOC (నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్) అవసరం లేదు. భూములు పొందిన వారి వివరాల్ని వార్డు, గ్రామ సచివాలయాల్లో ఉంచుతారు. సో... ఈ పథకాన్ని పొందేందుకు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో... వెంటనే ఆయా ప్రాంతాల్లోని లబ్దితారులు... తమ ఏరియాలోని వార్డు, గ్రామ వాలంటీర్లతో మాట్లాడి త్వరపడటం మేలు.

 

హాట్ అందాల రచ్చ చేస్తున్న పూజిత పొన్నాడఇవి కూడా చదవండి :

Nutrition In Fish : చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే...Diabetes Diet : బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించే 5 సుగంధ ద్రవ్యాలు...

Health Tips : ముల్లంగి తింటున్నారా... మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ...

Health : రోజూ 5 నిమిషాలు పరిగెడితే... కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Health Tips : డయాబెటిస్ లక్షణాలేంటి? ముందే గుర్తించడం ఎలా?
First published: December 3, 2019, 5:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading