హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: ఏపీలో కలకలం...అర్ధరాత్రి దర్గాకు నిప్పు.., దుండగుల పనేనా..?

Andhra Pradesh: ఏపీలో కలకలం...అర్ధరాత్రి దర్గాకు నిప్పు.., దుండగుల పనేనా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరో కలకలం రేగింది. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే దర్గాపై దుండగులు దాడికి పాల్పడ్డారు.

  ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఆలయాలపై దాడులతో రేగిన దుమారం చల్లారకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఐతే ఈసారి ఆలయాలపైనో విగ్రహాలపైనో దాడి జరగలేదు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే దర్గాపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం దీనిపై దుమారం రేగుతోంది. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా, గంగవరం మండలం, నాగరాయతిపాలెం గ్రామంలోని జిలానీ బాబా దర్గాను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దర్గాకు నిప్పంటించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ దర్గాలో ప్రతి ఏడాది ఏప్రిల్ లో ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరగుతాయి. దుండగులు నిప్పుపెట్టడంతో దర్గాలోని సామాగ్రి, పవిత్ర గ్రంధాలు, పీర్లు, చాదర్లు దగ్ధమమైనట్లు తెలుస్తోంది.

  దర్గాను నిర్వహించే మజౌమ్ ఏడాది క్రితం మృతి చెందడంతో అప్పటి నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఏప్రిల్, మే నెలల్లో జరిగే ఉర్సు ఉత్సవాల కోసం పెయింటింగ్ పనులు చేయిస్తున్న తరుణంలో ఇలా జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ దర్గాకు చుట్టుపక్కల నుంచి భక్తులు వస్తుంటారని., ఏడాదిగా ఖాళీగా ఉండటంతో ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చంటున్నారు.

  ఇటీవల రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు జరగడం, వీటిపై రాజకీయ దుమారం రేగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దర్గా దగ్ధమవడానికి కారణాలను విశ్లేషిస్తున్నారు. ఐతే ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక ఎరైనా కావాలనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో విచారిస్తున్నారు. సమీపంలోని ఇళ్లు, రోడ్లపై ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. దర్గాపై దాడికి దిగిన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chittoor, Fire Accident

  ఉత్తమ కథలు