Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH UNDER GROUND AND DRINKING WATER IS SAFER THAN ANY STATE IN INDIA FULL DETAILS HERE PRN

AP News: ఆంధ్రాలో తాగునీరు మంచిదేనా...? కేంద్ర ప్రభుత్వ పరీక్షల్లో తేలింది ఇదే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కేంద్ర జలమంత్రిత్వ శాఖ (Water Resources Department) ఏ రాష్ట్రంలోని భూగర్భ జలాలు సురక్షితంగా ఉన్నాయో అనే దానిపై పరీక్షలు నిర్వహించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని భూగర్భ జలాలే సురక్షితమని తేల్చింది.

    సాధారంణంగా తాగునీరంటే భూగర్భజలాలనే ఎక్కువ మంది వినియోగిస్తారు. పట్టణాలు, మెట్టప్రాంత గ్రామాల్లో మాత్రమే ఓవర్ హెడ్ ట్యాంకులు, రిజర్వాయర్ల ద్వారా తాగునీరు సరఫరా అవుతుంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో బోరుబావుల్లో నీరే తాగునీటి (Drinking Water) కి ప్రధాన వనరు. ఈ నేపథ్యంలో కేంద్ర జలమంత్రిత్వ శాఖ (Water Resources Department) ఏ రాష్ట్రంలోని భూగర్భ జలాలు సురక్షితంగా ఉన్నాయో అనే దానిపై పరీక్షలు నిర్వహించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని భూగర్భ జలాలే సురక్షితమని తేల్చింది. గత ఏడాది 2021 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బోర్లు, బావుల నీటిని పరీక్షించగా ఏపీ నీరే అత్యంత సురక్షితమని తేలింది.

    అన్ని రాష్ట్రాల్లో సేకరించిన వంద శాంపిల్స్ కు గానూ 14 శాంపిల్స్ లో కాలుష్య కారకాలను గుర్తించగా ఏపీ శాంపిల్స్ తో మాత్రం వందకు నాలుగు సాంపిల్స్ లో మాత్రమే కాలుష్య అవశేషాలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ లో గత నాలుగేళ్ల క్రితం వరకు ఫ్లోరైడ్ అనవాళ్లుండవని.. వర్షాభావ పరిస్థితుల నుంచి రాష్ట్రం బయటపడటంతో ఆ ప్రభావం తగ్గింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లోనూ భూగర్భ జలాల నాణ్యత పెరిగింది. రాష్ట్రమంతటా సమృద్ధిగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాల్లో నీటి నాణ్యత చాలాబాగా మెరుగైనట్లు గ్రామీణ నీటి సరఫరా విభాగం (RWS) అధికారులు తెలిపారు.

    ఇది చదవండి: సోమవారమంటే గిరిజనులకు ఎందుకంత భయం..? ఆ రోజు ఏం జరుగుతోంది..?


    తాగునీటిలో పాదరసం ఆనవాళ్లుంటే నాడీ వ్యవస్థపై ప్రభావం ఉంటుంది. అలగే క్లోరైడ్ కారకాలుంటే బీపీ వంటి వ్యాధులకు గురవుతారు. లెడ్ వంటివి ఉంటే చిన్న పిల్లల్లో ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. అలాగే పెద్దల్లో అయితే కిడ్నీ ఫెయిల్యూర్ కి దారితీస్తాయి. ఫ్లోరైడ్ కారణంగా కీళ్లవ్యాధులు రావడం, పళ్లు దెబ్బతినడం,. ఎముకలు పెళుసుబారడం వంటి వ్యాధులకు లోనవుతారు.

    ఇది చదవండి: ఏపీకి మరో భారీ పరిశ్రమ.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్..


    ఏపీలోని దాదాపు రెండున్నర లక్షలకు పైగా బోర్లు, బావులతో పాటు 50వేలకు పైబడి ఉన్న మంచినీటి పథకాల ద్వారా అందించే నేటిని ఏడాదికి రెండుసార్లు చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు. ఇక రూరల్ వాటర్ సప్లై పరిధిలో 107 వాటర్ టెస్టింగ్ ల్యాబ్ లు ఉండగా, వాటిలో 21 కలుషిత కాలకాలను గుర్తించే అవకాశముంది. దేశవ్యాప్తంగా 47,03,476 తాగునీటి నమూనాలను పరీక్షించగా అందులే ఏపీ నుంచి 4,04,083 నమూనాలకు నిర్వహించారు. వీటలో నాలుగు శాతమే కాలుష్. కారకాలున్నట్లు తెలిసింది. మొత్తం శాంపిల్స్ లో 16,801 నమూనాల్లోనే కాలుష్య కారక ఆనవాళ్లున్నట్లు నిపుణులు గుర్తించారు. వేసవి సందర్భంగా నీటి కాలుష్యం అధికంగా ఉంటున్న సమయంలో కేంద్రం ఇచ్చిన ఫలితాలు కాస్త ఊరట కలిగించేలా ఉన్నాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Drinking water

    తదుపరి వార్తలు