news18-telugu
Updated: September 5, 2020, 5:06 PM IST
ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫోటో)
ఏపీలోని జగన్ ఫ్రభుత్వం మరో ఘనత సాధించింది. కరోనా సమయంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆదాయం లేక కుదేలు అవుతుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో మొదటిస్థానంలో నిలిచింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ర్యాంకుల్లో రెండో స్థానంలో ఉత్తర ప్రదేశ్ , మూడో స్థానంలో తెలంగాణ ఉన్నాయి. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ శనివారం ర్యాంకింగ్‌ను విడుదల చేసింది. ఉత్తర భారతదేశం నుండి ఉత్తర ప్రదేశ్, దక్షిణ భారతదేశం నుండి ఆంధ్రప్రదేశ్, తూర్పు భారతదేశం నుండి పశ్చిమ బెంగాల్, పశ్చిమ భారతదేశం నుండి మధ్యప్రదేశ్ , ఈశాన్య భారతదేశం నుండి అస్సాం మొదటి స్థానంలో నిలిచాయి. ఇక కేంద్రపాలిత ప్రాంతాలలో ఢిల్లీ కి మొదటి స్థానం లభించింది. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, కేబినెట్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పాల్గొన్నారు.
ఈ ర్యాంకింగ్ ద్వారా పలు పెట్టుబడులను ఆకర్షించేందకు దోహదపడుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక అమలుపై ఆధారపడి ఉందని పియూష్ గోయల్ చెప్పారు. మరోవైపు సంస్కరణలపై భారతదేశం యొక్క స్థిరమైన నిబద్ధత కారణంగా ప్రపంచ బ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో 2019 లో 63వ ర్యాంక్ కు చేరిందని గోయల్ చెప్పారు.
Published by:
Krishna Adithya
First published:
September 5, 2020, 5:06 PM IST