ఏపీలోని ఈ జిల్లాల్లో నెలాఖరు వరకు వర్షాలు...

రాయలసీమలో ఈరోజు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఏపీలో ఈ నెలాఖరు వరకు సాధారణం నుంచి మధ్యస్థంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌కు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. ఏపీలో ఈ నెలాఖరు వరకు సాధారణం నుంచి మధ్యస్థంగా వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడొచ్చు. దక్షిణ కోస్తాలో కొంచెం ఎక్కువ వర్షాలు పడొచ్చని అంచనా. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. శనివారం రోజు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. దక్షిణ కోస్తాలో సాధారణ వర్షపాతం నమోదైంది. గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో కొంచెం గట్టిగానే వర్షం పడింది. రాయలసీమలోని పలుచోట్ల వర్షాలు పడ్డాయి.

    మరోవైపు ఈ సంవత్సరం వర్షాలు సాధారణంగానే ఉంటాయని ఐఎండీ స్పష్టం చేసింది. ‘ఈ సంవత్సరం సాధారణ వర్షాలు ఉంటాయి. 2020 వర్షాకాలంలో 100 శాతం వర్షాలు పడొచ్చు. మహా అయితే, ఓ 5 శాతం అధికం లేదా 5 శాతం తక్కువ ఉండొచ్చు.’ అని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ మాధవన్ రాజీవన్ తెలిపారు. ‘ఇది మనకు నిజంగా గుడ్ న్యూస్. ఇది మన వ్యవసాయ రంగానికి దోహదం చేస్తుంది. పంటలు బాగా పండడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కూడా ఉపయోగపడుతుంది.’ అని మాధవన్ అన్నారు. జూన్ 1 నాటికి కేరళను నైరుతి రుతుపవనాలు పలకరించే అవకాశం ఉంది. జూన్ 4 నాటికి చెన్నై, జూన్ 7 నాటికి పంజింమ్, జూన్ 8 నాటికి హైదరాబాద్, 10 నాటికి పుణె, 11 నాటికి ముంబై, జూన్ 27 నాటికి దేశ రాజధాని ఢిల్లీకి నైరుతి రుతుపవనాలు చేరే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: