Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH TO GIVE FREE TRAINING TO SC WOMAN AND GIVE PLACEMENTS FULL DETAILS HERE PRN NJ

Good News: ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్.. ఫ్రీ ట్రైనింగ్.. జాబ్ గ్యారెంటీ..! వివరాలివే..!

మంత్రి మేరుగ నాగార్జున

మంత్రి మేరుగ నాగార్జున

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో రాష్ట్రప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టనుంది. ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చి.. వారికి ఆర్టీసీ (APSRTC) లోనే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లనుంది.

    ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో రాష్ట్రప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టనుంది. ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చి.. వారికి ఆర్టీసీ (APSRTC) లోనే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి మేరుగ నాగార్జున (Minister Meruga Nagarjuna) తెలిపారు. స్వదేశంలోనూ, విదేశాల్లోనూ పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేయాలనుకునే విద్యార్థులకు ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా రుణాలు అందించనున్నట్లు తెలిపారు. వివిధ పథకాల అమలుపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ నిధుల్లో 57 శాతం ఇన్‌కం జనరేషన్ పథకాలకు, 10శాతం నైపుణ్యాభివృద్ధికి, 30శాతం భవన నిర్మాణాలను ఉపయోగించాల్సి ఉంటుందని చెప్పారు. రూ.135 కోట్ల నిధులతో పలు కార్యక్రమాలను చేపట్టనున్నామని ప్రకటించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు.

    ఆర్టీసీ శిక్షణా కేంద్రాల ద్వారా మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ
    నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఆర్.టి.సి (RTC) ద్వారా ఎస్సీ మహిళలకు (SC women) భారీ వాహనాల డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ శిక్షణానంతరం మహిళలను ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లుగా (Drivers) ఖాళీగా ఉన్న స్థానాల్లో నియమించనున్నారు. ఆర్టీసీ శిక్షణా కేంద్రాల్లోనే ఈ శిక్షణ ఉంటుందన్నారు. సాంఘిక సంక్షేమశాఖ ద్వారా శిక్షణ పొందే అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.

    ఇది చదవండి: ఏపీలో పెరగనున్న బస్సు ఛార్జీలు..! ఎంత పెరుగుతున్నాయంటే.!


    నర్సింగ్‌లోనూ ప్రత్యేక శిక్షణ
    దేశ, విదేశాల్లో నర్సింగ్ పోస్టులకు ఉన్న డిమాండ్ దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల ఆధ్వర్యంలో నర్సింగ్‌లోనూ ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు మేరుగ నాగార్జున తెలిపారు. యూకేలో 10వేల నర్సింగ్ (Nursing)పోస్టులు ఖాళీగా (Vacancy) ఉన్నాయని ఈ సందర్భంగా ఉదహరించారు.

    ఇది చదవండి: గన్నవరం టికెట్ పై కొడాలి నాని క్లారిటీ.. స్నేహితడికే ఓటు.., మళ్లీ రచ్చ తప్పదా..?


    కార్పోరేషన్‌ (Corporation) ద్వారా రుణాలు
    ఎస్సీ కార్పొరేషన్ (SC corporation) ద్వారా అమలుచేస్తున్న ఉపాధి పథకాల్లో భాగంగా వాహనాల కొనుగోలు కోసం అధికారులు ప్రతిపాదించిన రూ.12 లక్షల రుణ మొత్తాన్ని రూ.16 లక్షలకు పెంచాలని అధికారులు ఆదేశించారు. స్థానికంగా డిమాండ్ ఉన్న చిన్న మొత్తంలో వ్యాపారాలు చేసుకోవడానికి కూడా రుణాలను సమకూర్చాలని కోరారు.



    పీజీ చదివే విద్యార్థులకు కూడా రుణాలను అందించనున్నామని తెలిపారు. ఎన్.ఎస్.కే.ఎఫ్.డీ.సి (NSKFDC) పథకం కింద విదేశాల్లో పీజీ చదివే వారికి రూ.20 లక్షలు, స్వదేశంలో పీజీ చదివేవారికి రూ.15 లక్షల చొప్పున రుణంగా అందిస్తామని వివరించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap government

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు