Andhra Pradesh High Court : ఆంధ్రప్రదేశ్ రాజధానిలో కొత్తగా నిర్మించిన తాత్కాలిక హైకోర్టు భవనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ప్రారంభించారు. సీఆర్డీఏ పరిధిలోని నేలపాడులో ఈ భవనాన్ని నిర్మించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్‌తో పాటు సుప్రీంకోర్టులోని తెలుగు న్యాయమూర్తులు జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ సుభాష్‌రెడ్డి, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కొందరు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 15 తర్వాత హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Live from the inauguration of Andhra Pradesh High Court with Hon'ble Chief Justice of India Ranjan Gogoi, Amaravati https://t.co/izGkfIqVA0
— N Chandrababu Naidu (@ncbn) February 3, 2019
హైకోర్టు ప్రత్యేకతలు :
* ఈ భవనాన్ని రూ.110 కోట్లతో జీ+2 అంతస్తుల్లో నిర్మించారు.
* 2.5 లక్షల చదరపు అడుగుల్లో భవన నిర్మాణం ప్రారంభమైంది.
* మొదటి అంతస్తులో కోర్టు హాళ్ల నిర్మాణం పూర్తైంది.
* భవనానికి అన్ని వైపులా రాజస్తాన్ పాలరాళ్లను పేర్చారు.
* జాతీయ జెండా కోసం భవనం ముందు 100 అడుగుల స్తూపం ఏర్పాటుచేశారు.
* 2.5 లక్షల రికార్డులు భద్రపరిచేలా ఏర్పాట్లు చేశారు.
* భవనం పక్కనే జీ+5 అంతస్తుల్లో లాయర్ల కోసం మరో భవనం నిర్మిస్తున్నారు.
* భవనం ఎదురుగా జడ్జిల కోసం విల్లాల నిర్మాణం.
* మహిళా లాయర్లకు స్పెషల్ రూం, ప్రభుత్వ లాయర్లకు చాంబర్లు, క్యాంటీన్ ఉంది.
* ప్రజలు వచ్చేందుకు వీలుగా విజయవాడ, గుంటూరు జిల్లాల నుంచి బస్సులు.
Video : ఏపీ తాత్కాలిక హైకోర్టు భవనం డ్రోన్ దృశ్యాలు...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.