Andhra Pradesh Telangana Weather Today Live: ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు.. నదులు ఉప్పొంగే అవకాశం

Andhra Pradesh Telangana Weather Today Live: ఏపీ, తెలంగాణలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

  • News18 Telugu
  • | August 14, 2022, 10:05 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED 2 MONTHS AGO

    AUTO-REFRESH

    Highlights

    18:14 (IST)

    తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.  చాలా చోట్ల ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు పడుతున్నాయి. మరో రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.  ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని పేర్కొంది. ఎల్లుండి కూడా అక్కడక్కడా వానలు కురుస్తాయని వెల్లడించింది.

    17:26 (IST)

    హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముంది ఐఎండీ హైదరాబాద్ పేర్కొంది. గంటకు 8-16 కి.మీ.  వేగంతో గాలులు వీసే అవకాశముంది.

    15:37 (IST)

    IMD హైదరాబాద్ తాజా వెదర్ బులెటిన్. తెలంగాణలోని ఈ జిల్లాల్లో మరికాసేపట్లో వర్షాలు పడే అవకాశం.

    14:29 (IST)

    తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు వాతావరణం ఇలా ఉండొచ్చు

    13:45 (IST)

    ఇవాళ ఉదయం నుంచి ఉత్తర, మధ్య ఆంధ్ర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాకలో గరిష్టంగా 65 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.  చాలా ప్రాంతాల్లో 20 మిల్లీమీటర్ల వాన పడింది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

    13:0 (IST)

    ఎగువన వర్షాలు తగ్గడంతో గోదావరి నదికి వరద ప్రవాహం తగ్గింది. అందువల్ల భద్రాచలం, ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం నిలకడగా ఉంది. ఐతే ఇవాళ్టి నుంచి రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మళ్లీ వరద పెరిగే అవకాశముంది.

    12:23 (IST)

    కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. గేట్లు ఓపెన్ కావడంతో ఆ జల సవ్వడులను కనులారా వీక్షించేందుకు పర్యాటకులు తరలిస్తున్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడకల నేపథ్యంలో శ్రీశైలం డ్యామ్‌ వద్ద కూడా మూడు రంగుల్లో లైట్లు ఏర్పాటు చేశారు. 

    11:24 (IST)

    తెలంగాణలోని అసిఫాబాద్,  మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి,  సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం,మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, సిద్దిపేట జిల్లాల్లో రాబోయే 3 గంటల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

    10:8 (IST)

    తెలంగాణలోని నిర్మల్, అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో రాబోయే మూడు గంటల్లో ఈదురు గాలులతో కూడిన తేలిక పాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం తెలిపింది.

    9:58 (IST)

    వాయుగుండగం ప్రభావంతో విశాఖపట్టణంలో మధ్యాహ్నం వరకు తేలికపాటి జల్లులు కురిసే అవకాశముంది.

    ఏపీలో మళ్లీ వర్షాలు (Andhra Pradesh Rains) మొదలయ్యాయి. ఉత్తరాంధ్రలోని పార్వతీపురంలో ఇప్పటికే వానలు పడుతున్నాయి. అవి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలకు కూడా విస్తరిస్తున్నాయి. ఇవాళ విశాఖపట్టణ నగరంలో వాతావరణం చల్లగా ఉంటుందని.. తేలికపాటి వర్షపు జల్లులు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో.. రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు. నాగవళి, వంశధార నదికి వరద పోటెత్తే అవకాశముందని అంచనా వేశారు. అటు తెలంగాణలో కూడా ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Telangana Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది.