Andhra Pradesh Telangana Weather Today Live: నేటి నుంచి మళ్లీ జోరుగా వానలు.. ఈ జిల్లాలకు వరద ముప్పు

Andhra Pradesh Telangana Weather Today Live: బంగాఖాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వానలు పడతాయని పేర్కొంది.

  • News18 Telugu
  • | August 13, 2022, 09:59 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED 2 MONTHS AGO

    AUTO-REFRESH

    Highlights

    17:48 (IST)

    మరో 3 గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు

    నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో మరో మూడు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తర వర్షాలు పడవచ్చని వాతావరణశాఖ తెలిపింది.

    16:44 (IST)

    హైదరాబాద్‌లో ఇవాళ సాయంత్రం వాతావరణం మేఘావృతమై ఉంటుంది.  నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి దిశ నుంచి గంటకు 8 నుంచి 12 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

    15:31 (IST)

    గోదావరికి వరద ప్రవాహం క్రమంతా తగ్గుతోంది.  రెండు రోజులుగా వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో గోదావ‌రి వ‌ర‌ద ప్ర‌వాహం త‌గ్గుతూ వ‌స్తుంది. ఈరోజు భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి నీటిమ‌ట్టం స్వ‌ల్పంగా త‌గ్గింది.  51.3 అడుగుల‌కు చేరింది. నిన్న సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యానికి వ‌ర‌ద ప్ర‌వాహం 52.20 అడుగుల వ‌ద్ద  ఉన్న విషయం తెలిసిందే. ఐతే అది క్రమంగా తగ్గుతూ వస్తోంది.

    14:49 (IST)

    తెలంగాణలో వాతావరణానికి సంబంధించి ఐఎండీ లేటెస్ట్ బులెటిన్

    13:22 (IST)

    అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో మరికాసేపట్లో వర్షాలు పడతాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. అవి క్రమంగా విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్టణం నగరాలకు విస్తరిస్తాయని పేర్కొన్నారు.

    11:32 (IST)

    తెలంగాణలో ఇవాళ, రేపు కొన్ని ప్రాంతాల్లో  ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే వారం రోజుకు గాను వెదర్ బులెటిన్‌ను విడుదల చేసింది.

    10:4 (IST)

    ఏపీలో నాగావళి, వంశధార నదులు ఉప్పొంగి ప్రవహించే అవకాశం ఉందని.. శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

    10:2 (IST)

    హైదరాబాద్‌లో  ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

    10:0 (IST)

    అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇవాళ్టి నుంచి మళ్లీ వర్షాలు పడతాయని ఏపీ వెదర్ మ్యాన్  అంచనా వేశారు.


    తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి మళ్లీ విస్తారంగా వర్షాలు (AP Telangana Rains) కురుస్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ (IMD Weather Forecast) తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low Pressure in bay of bengal) ఒడిశా సమీపానికి వచ్చింది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. ఇవాళ రాత్రి నాటికి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్టణం సిటీ, పాడేరు, అనకాపల్లి, కాకినాడలో వానలు పడతాయి. అర్ధరాత్రి తర్వాత ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కాకినాడలో వర్షాలు పెరుగుతాయని ఏపీ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. తెలంగాణలోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది.