Andhra Pradesh Telangana Weather Today Live: ఏపీలోని ఈ జిల్లాల్లో రేపటి నుంచి అతి భారీ వర్షాలు

Andhra Pradesh Telangana Weather Today Live: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీగా వానలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రేపటి నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.

  • News18 Telugu
  • | August 12, 2022, 10:34 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED 2 MONTHS AGO

    AUTO-REFRESH

    Highlights

    17:2 (IST)

    హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఉంటుంది.  తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముంది.

    15:29 (IST)

    వచ్చే వారం నాగావళి, వంశధార నదులకు భారీగా వరద పోటెత్తే అవకాశముందని ఏపీ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. వరదలతో శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాలు దెబ్బతినే అవకాశముందని హెచ్చరించింది. 

    13:24 (IST)

    తెలంగాణలో రేపటి నుంచి మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది. ఆగస్టు 14న అసిఫాబాద్,మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీచేసింది. 15న కూడా పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.

    12:7 (IST)


    ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితులు నెలకొన్నాయి. అల్పపీడన ప్రాంతానాకి దక్షిణాన దట్టమైన మేఘాలు ఏర్పడుతున్నాయి. దీని ప్రభావం రేపటి నుంచి ఏపీపై ఉండవచ్చని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు.

    10:27 (IST)

    తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వరద నీరు పోటెత్తడంతో.. కృష్ణా నదిపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. జూరాల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని  జలాశయాలు నిండుకుండల్లా మారాయి. నాగార్జున సాగర్ పూర్తిగా నిండడంతో మొత్తం 26 గేట్లను ఎత్తి.. పులిచింతల ప్రాజెక్టుకు నీటిని వదులుతున్నారు.

    10:24 (IST)

    రేపటి నుంచి ఆగస్టు 16 వరకు ఏపీలో వాతావరణ పరిస్థితి ఇలా ఉంటుంది.

    10:19 (IST)

    ఏపీలో వాతావరణ పరిస్థితిపై ఏపీ వెదర్ మ్యాన్ తాజా అప్‌డేట్

    10:17 (IST)

    వాయుగుండం ప్రభావంతోఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. ఆగస్టు 14 నుంచి 16 వరకు  పార్వతీపురం, పాడేరు, శ్రీకాకుళం, విజయనగరంలో కుండపోత వానలు పడతాయని తెలిపారు.

    10:17 (IST)

    ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడితే ఉత్తరాంధ్ర, మధ్యాంధ్రతో పాటు ఈశాన్య తెలంగాణలలో వర్షాలు పడుతుంటాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉందని ఏపీ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. రేపటి నుంచి ఏపీలో వానలు పడతాయని.. ఎల్లుడి నుంచి మరింతగా పెరుగుతాయని వెల్లడించారు.

    ఏపీని వరద గండం (Andhra Pradesh Rains) ఇంకా వీడలేదు. ఇప్పటికే లంక గ్రామాలు నీట మునిగి ఇబ్బందులు పడుతుండగా... మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి.  ఆగస్టు 14న వాయుగుండం (Dep ఉత్తర బంగాఖాతంపై విరుచుకుపడనుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్ (Andhra Pradesh Weatherman) పేర్కొన్నారు. ఆగస్టు 14 నుంచి 16 వరకు  పార్వతీపురం, పాడేరు, శ్రీకాకుళం, విజయనగరంలో కుండపోత వానలు పడతాయని తెలిపారు.