Today News Highlights | నేటి వార్తల్లో ముఖ్యాంశాలు..

తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తల సమాహారం. తాాజా హైలైట్స్ ఒక్కసారి చూద్దాం.

news18-telugu
Updated: July 17, 2020, 9:04 PM IST
Today News Highlights | నేటి వార్తల్లో ముఖ్యాంశాలు..
News18 Telugu
  • Share this:
తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు, కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. Full Story

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 2602 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఏపీలో ఉన్న వారికి 2592, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 8 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. Full Story

తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతకు అడ్డంకులు తొలిగిపోయాయి. సెక్రటేరియట్ కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కూల్చివేతలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌లను న్యాయస్థానం తోసిపుచ్చింది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. Full Story

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసి వినతీ పత్రం సమర్పించాల్సిందిగా నిమ్మగడ్డను ఏపీ హైకోర్టు ఆదేశించింది. Full Story

రాగల 5 రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో పాటు షియర్‌ జోన్‌ ఏర్పడటంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. Full Story

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించి కేరళ గోల్డ్ స్కాంలో మరో బ్రేకింగ్ న్యూస్. విజయన్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని ప్రతిపక్ష యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రకటించింది. లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం మీద నో కాన్ఫిడెన్స్ తీర్మానాన్ని ప్రతిపాదించింది. Full story

రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం సంచలన మలుపు తిరిగింది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేసిందని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్ లాల్ పై కేసు నమోదైంది. Full Storyబంగారంపై రుణాలు తీసుకోవాలనుకునేవారికి శుభవార్త. ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన కెనెరా బ్యాంకు అతి తక్కువ వడ్డీ రేటుకే గోల్డ్ లోన్స్ అందిస్తోంది. కేవలం నెలకు 64 పైసల వడ్డీకే బంగారంపై రుణాలు ఇస్తోంది. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. Full Storyకేవలం 20 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ను 100 పర్సెంట్ ఛార్జ్ చేసే ఛార్జింగ్ సొల్యూషన్‌ను రూపొందించింది రియల్‌మీ. 125వాట్ అల్ట్రాడార్ట్ ఛార్జింగ్ సొల్యూషన్ పేరుతో ప్రపంచానికి పరిచయం చేసింది. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. Full Story

ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. అప్పట్లో ఆటతో.. ఆ తర్వాత అందంతో.. ఆ తర్వాత కాంట్రవర్సీలతో ఇప్పుడేమో ప్రేమతో వార్తల్లో నిలిచింది గుత్తా. తాజాగా ఈమె ప్రేమలో ఉన్నట్లు మరోసారి కన్ఫర్మ్ చేసింది. Full story
Published by: Ashok Kumar Bonepalli
First published: July 17, 2020, 8:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading