Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH TELANGANA HIGH COURT CHIEF JUSTICES TRANSFERED HERE IS FULL LIST BA

ఆంధ్ర, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌లు మార్పు, కొత్త వారు వీరే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని పలు రాష్ట్రాల హైకోర్టుల చీఫ్ జస్టిస్‌లు, జస్జిస్‌లను మారుస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ జేకే మహేశ్వరిని సిక్కిం చీఫ్ జస్టిస్‌గా బదిలీ చేశారు. అలాగే, సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ ఏకే గోస్వామి ఏపీ హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని పలు రాష్ట్రాల హైకోర్టుల చీఫ్ జస్టిస్‌లు, జస్జిస్‌లను మారుస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ జేకే మహేశ్వరిని సిక్కిం చీఫ్ జస్టిస్‌గా బదిలీ చేశారు. అలాగే, సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ ఏకే గోస్వామి ఏపీ హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. ఇక తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ ఎస్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఆయన స్థానంలో ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ హిమా కోహ్లీ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులు అయ్యారు. వీరితో పాటు కొత్తగా ఏపీ హైకోర్టుకు మరో జడ్జిని కేటాయించారు. ప్రస్తుతం కలకత్తా హైకోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఏపీ, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కిం, మద్యప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, ఒడిశా, పంజాబ్ హర్యానా, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన జడ్జిలు బదిలీ అయ్యారు.

    జడ్జిల మార్పు జాబితా














































































    పేరుప్రస్తుతంబదిలీ అయిన హైకోర్టు
    ఆర్. ఎస్. చౌహాన్ (సీజే)తెలంగాణఉత్తరాఖండ్
    జేకే మహేశ్వరి (సీజే)ఆంధ్రప్రదేశ్సిక్కిం
    మహమ్మద్ రఫీక్ (సీజే)ఒడిశామధ్యప్రదేశ్
    ఏకే గోస్వామి (సీజే)సిక్కింఆంధ్రప్రదేశ్
    సంజయ్ యాదవ్మధ్యప్రదేశ్అలహాబాద్
    రాజేష్ బిందాల్జమ్మూ కాశ్మీర్కలకత్తా
    వినీత్ కొఠారీమద్రాస్గుజరాత్
    జాయ్‌మాల్యా బాగ్జీకలకత్తాఆంధ్రప్రదేశ్
    సతీష్ చంద్ర శర్మమధ్యప్రదేశ్కర్ణాటక
    ఎస్. మురళీధర్పంజాబ్ & హర్యానాఒడిశా (సీజే)
    హిమా కోహ్లీఢిల్లీతెలంగాణ (సీజే)
    సంజీబ్ బెనర్జీకలకత్తామద్రాస్ (సీజే)
    పంకజ్ మిట్టల్అలహాబాద్జమ్మూకాశ్మీర్ (సీజే)
    సుధాన్షు ధులియాఉత్తరాఖండ్గువాహటి

    ఏపీ హైకోర్టు సీజేగా నియమితులైన జస్టిస్ గోస్వామి 1961లో జన్మించారు. 1981లో కాటన్ కాలేజీ నుంచి పట్టా పట్టా పొందారు. 1985లో లా పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపు, మిజోరాం బార్ కౌన్సిల్‌లో తన పేరు నమోదు చేసుకున్నారు. 2004లో సీనియర్ అడ్వొకేట్‌గా ప్రమోషన్ లభించింది. 2004లో గువాహటి హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్‌లో సీనియర్ అడ్వొకేట్‌గా గుర్తింపు పొందారు.2011లో జస్టిస్ గోస్వామి హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2019లో సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు.



    ఇక తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితురాలైన జస్టిస్ హిమా కోహ్లీ 1959 సెప్టెంబర్ 2న జన్మించారు. ఢిల్లీ హైకోర్టులో జడ్జిగా ఉన్న ఆమెకు ప్రమోషన్ మీద తెలంగాణ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. ఆమె విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే కొనసాగింది. 1984లో ఆమె న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1999- 2004 మధ్య న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్, లీగల్ అడ్వైజర్ గా వ్యవహరించారు.2006 మే 29న ఢిల్లీ హైకోర్టులో అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2007 ఆగస్టు 29న పర్మినెంట్ జడ్జిగా నియమితురాలయ్యారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు