హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

తెలంగాణ హైకోర్టు ప్రారంభం... చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టు ప్రారంభం... చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొత్త సంవత్సరాన్ని కొత్త హైకోర్టు ప్రారంభోత్సవంతో మొదలుపెడుతోంది నవ్యాంధ్ర. అమరావతి కేంద్రంగా ఇవాళ ఏపీ హైకోర్టు ప్రారంభమవుతోంది. అటు తెలంగాణలో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రాధాకృష్ణన్‌ ప్రమాణం చేయడంతో తెలంగాణలో కొత్త హైకోర్టు ప్రారంభమైంది.

ఇంకా చదవండి ...

తెలంగాణ హైకోర్టు ప్రారంభం:

తెలుగు రాష్ట్రాలు విడిపోయి నాలుగేళ్లు దాటినా... ఇన్నాళ్లూ హైకోర్టు మాత్రం ఉమ్మడిగానే ఉంది. ఇప్పుడు అది కూడా విడిపోయింది. కొత్త సంవత్సరం తొలిరోజు తెలంగాణ హైకోర్టు ప్రారంభమైంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కలలో భాగమైన సొంత హైకోర్టు ఇవాళ్టి నుంచీ అమల్లోకి వచ్చింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌ ఉదయం 8.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణం చేశారు. జనవరి 1వ తేదీ సెలవుదినం కావడంతో హైకోర్టు కార్యకలాపాలు ఉండవు. రేపటి నుంచి కొత్త హైకోర్టు కొలువుదీరుతుంది.

video: ఆంధ్రాలాయర్లకు ఆత్మీయ వీడ్కోలు | emotional send off to ap lawyers from telangana lawyers at hyderabad highcourt
lawyers send off at highcourt

ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అమరావతి కేంద్రంగా పనిచేయబోతోంది. హైకోర్టు కార్యకలాపాలకు, జడ్జీలు, అధికారుల వసతికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ కొత్త తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో ఉదయం 10.30 గంటలకు జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌తోపాటు మరో 13 మంది న్యాయమూర్తులతో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ ఇవాళ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు.

ap high court, high court, ap and telangana high court, telangana news, telangana high court, andhra pradesh high court, andhra pradesh, andhra pradesh high court construction, andhra pradesh will have separate high court, telangana, cj of ap and telangana high court, ap telangana high court division, high court for andhra pradesh, radhakrishnan as cj of ap & telangana high court, high court, ap high court, high court bifurcation, telangana high court, meghalaya high court, centre over high court, hyderabad high court bifurcation, centre over high court bifurcation, court, the high court, high court judges, aro high court 2018, high court division, high court partition, high court buildings, allahabad high court, rajasthan high court, ap high court bifurcation, meghalaya high court judge, తెలంగాణ హైకోర్టు, ఏపీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు,
అమరావతిలో నిర్మాణంలో ఉన్న హైకోర్టు భవనం

జనవరి 2 నుంచి ఏపీ హైకోర్టు కార్యకలాపాలు మొదలవుతాయి. హైకోర్టు కోసం ఎం.జి.రోడ్డులోని ఏ.పి.ఏ.టి. భవనంలో 10,000 చదరపు అడుగులు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్‌ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు. అందులో ఫర్నిచర్‌ ఏర్పాటు చేయమని సీఆర్‌డీఏను, హైకోర్టు కార్యకలాపాల అవసరాలకు కంప్యూటర్లను సమకూర్చాలని ఐటీ శాఖను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి:


#HappyNewYear: సెలబ్రిటీస్ న్యూ ఇయర్‌ విషెస్


ప్రపంచ వ్యాప్తంగా మిన్నంటిన కొత్త సంవత్సరాది వేడుకలు


మగబిడ్డ కోసం తల్లిని చంపేశారు

First published:

Tags: Andhra Pradesh, High Court, Telangana News

ఉత్తమ కథలు