హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీ ప్రభుత్వ టీచర్లకు టెన్షన్‌..! ప్రమోషన్‌ల లిస్ట్‌ రెడీ.. వివరాలివే..!

ఏపీ ప్రభుత్వ టీచర్లకు టెన్షన్‌..! ప్రమోషన్‌ల లిస్ట్‌ రెడీ.. వివరాలివే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పండగ సమయంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)‌ ప్రభుత్వ పాఠశాలల టీచర్లందరూ ఒకింత టెన్షన్ ‌కు గురవ్వనున్నారు. ఎవరికి ప్రమోషన్‌ వస్తుందో..! ఎవరికి ఆగిపోతుందో అని కంగారు పడుతున్నారు. ఎందుకంటారా..?

 • News18 Telugu
 • Last Updated :
 • Andhra Pradesh, India

  పండగ సమయంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)‌ ప్రభుత్వ పాఠశాలల టీచర్లందరూ ఒకింత టెన్షన్ ‌కు గురవ్వనున్నారు. ఎవరికి ప్రమోషన్‌ వస్తుందో..! ఎవరికి ఆగిపోతుందో అని కంగారు పడుతున్నారు. ఎందుకంటారా..? ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ స్కూల్‌ టీచర్‌ల (AP Government teachers) ప్రమోషన్‌లకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం ఓ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ జిల్లా, మండల పరిషత్‌ స్కూల్‌లో పనిచేస్తున్న అసిస్టెంట్స్‌, గ్రేడ్‌-2 హెడ్‌మాస్టర్‌ల ప్రమోషన్ ‌కు పాఠశాల విద్య కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ ఓ షెడ్యూల్ ‌ను విడుదల చేశారు.

  స్కూల్‌ అసిస్టెంట్స్‌, ఎస్‌జీటీ ప్రాథమిక సీనియారిటీ లిస్ట్ ‌ను ఈ నెల 7వ తేదీన సంబంధిత వెబ్ ‌సైట్‌లో ఉంచనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీచర్లలో పండగ సమయంలో ఓ రకమైన ఒత్తిడి నెలకొననుంది. ఆ లిస్ట్ ‌ను పరిశీలించుకున్నాక వాటిపై ఎవ్వరికైనా ఎటువంటి అభ్యంతరాలున్నా కూడా ఆన్ ‌లైన్‌ ద్వారా ఈ నెల 8 లోగా తెలపొచ్చు. అలా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు ఈ నెల 9వ తేదీన మరోసారి పరిశీలించి తుది సీనియారిటీ లిస్ట్ ‌ను ఈ నెల 10న విడుదల చేస్తారు.

  ఇది చదవండి: వైసీపీ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్.. సీఎం జగన్ వ్యూహం వర్కవుట్ అవుతుందా..?

  అనంతరం గ్రేడ్‌–2 పోస్టుల ప్రమోషన్లను అక్టోబర్‌ 11న, స్కూల్‌ అసిస్టెంట్లు దానికి సమానమైన ఇతర పోస్టుల ప్రమోషన్‌లకు సంబంధించిన లిస్ట్ ‌ను ఈ నెల 12, 13 తేదీల్లో విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్య కమిషనర్‌ ఎస్‌. సురేష్ ‌కుమార్‌ తెలిపారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap government, Local News

  ఉత్తమ కథలు