ఆంధ్రప్రదేశ్... కాకినాడ జిల్లా.. ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌ఛార్జి వరుపుల రాజా గుండెపోటుతో చనిపోయారు. శనివారం రాత్రి ఉన్నట్టుండి ఆయనకు గుండె దగ్గర నొప్పి (Heart Attack) రావడంతో.. ఆయన్ని కాకినాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ట్రీట్‌మెంట్ చేస్తుండగా.. ఆయన కన్నుమూశారు. ఆయన వయస్సు 47 ఏళ్లు. రాజా హఠాన్మరణంతో.. టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు.
వరుపుల రాజా ప్రస్తుతం బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాలకు టీడీపీ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన... ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నారు. శనివారం కూడా ప్రచారం చేసి సాయంత్రానికి సొంతూరైన ప్రత్తిపాడు వెళ్లారు. ఆ తర్వాత కూడా బిజీగా గడిపారు. పార్టీ కార్యకర్తలు, బంధువుల మాట్లాడుతూ ఉండగా... రాత్రి 8 తర్వాత గుండె దగ్గర నొప్పి వచ్చింది. వెంటనే కాకినాడలోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు ఎన్నో రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రాత్రి 11.20కి వరుపుల రాజా కన్నుమూశారని డాక్టర్లు తెలిపారు.
వరుపుల రాజాకి హార్ట్ ఎటాక్ రావడం ఇదే తొలిసారి కాదు. ఇదివరకు రెండుసార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది. డాక్టర్లు స్టంట్స్ వేశారు. ఆయన గుండెకు రక్త ప్రసరణ సరిగా జరగని సమస్య ఉంది. అది మరోసారి ఏర్పడటం వల్లే ఈ హార్ట్ ఎటాక్ వచ్చింది.
ప్రత్తిపాడు మండల అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాజా.. DCCB ఛైర్మన్‌గా పనిచేశారు. అలాగే ఆప్కాబ్ వైస్ ఛైర్మన్‌గా కూడా సేవలు అందించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. కొద్దిలో ఓడిపోయారు. ఇలా ఎప్పుడూ పార్టీ గురించే ఆలోచించే రాజా మరణం.. అందర్నీ కలచివేసింది. ఈమధ్య చాలా మంది హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్టులతో చనిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, TDP