Andhra Pradesh: జైలు నుంచి విడుద‌ల‌.. ఆపై మాయం.. టీడీపీ నేత పట్టాభి అదృశ్యం.. ఏం జ‌రుగుతోంది!

టీడీపీ నేత పట్టాభి (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (AP CM YS Jagan Mohan Reddy) అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ నేత ప‌ట్టాభి అరెస్ట‌యిన విష‌యం అంద‌రికీ తెల‌సిందే. అయితే ఆయ‌న శనివారం బెయిల్‌పై విడ‌ద‌ల అయ్యారు. అనంత‌రం ఆయ‌న రాజ‌మండ్రి నుంచి విజ‌య‌వాడ బ‌య‌ల్దేరారు. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఇంటికి చేర‌లేదు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (AP CM YS Jagan Mohan Reddy) అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ నేత ప‌ట్టాభి అరెస్ట‌యిన విష‌యం అంద‌రికీ తెల‌సిందే. అయితే ఆయ‌న శనివారం బెయిల్‌పై విడ‌ద‌ల అయ్యారు. అనంత‌రం ఆయ‌న రాజ‌మండ్రి నుంచి విజ‌య‌వాడ బ‌య‌ల్దేరారు. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఇంటికి చేర‌లేదు. దీంతో టీడీపీ కార్య‌క‌ర్త‌ల్లో టెన్ష‌న్ నెల‌కొంది.. ప‌ట్టాభి మా క‌స్ట‌డీలో లేడ‌ని పోలీసులు ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. దీంతో ప‌ట్టాభి ఎక్క‌డి వెళ్లాడ‌ని టీడీపీ శ్రేణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. సీపై అనుచిత వాఖ్య‌ల కార‌ణంగా ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై విజయవాడ (Vijayawada) గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.

    దీంతో ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు మచిలీపట్నం జిల్లా జైలుకు తరలించారు. అనంతరం విజయవాడ కోర్టులో హజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

    Telangana Agriculture : దేశంలో మిన‌ప‌ప్పు కొర‌త ఉంది.. పండించండి కొంటాం: మంత్రి నిరంజ‌న్‌రెడ్డి


    ఏం జ‌రిగింది..
    ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితం తలుపులు పగలగొట్టి ఆయన ఇంట్లోకి వెళ్లిన పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పట్టాభి (Pattabhi) అరెస్ట్‌కు ముందు ఆయన నివాసం దగ్గర హైడ్రామా నడిచింది. ఆయనను అరెస్ట్ చేయాలని నిర్ణయించుకున్న పోలీసులు.. ముందుగా అక్కడ పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించడంతో పట్టాభి అరెస్ట్ ఖాయమని భావించిన టీడీపీ (TDP) శ్రేణులు.. మధ్యాహ్నం నుంచే అక్కడికి చేరుకోవడం మొదలుపెట్టాయి. టీడీపీ మహిళా కార్యకర్తలు, కార్పొరేటర్లు, విజయవాడ(Vijayawada)కు చెందిన పార్టీ నేతలు పట్టాభి ఇంటి దగ్గరకు చేరుకున్నారు.

    పలువురిపై కేసు న‌మోదు..
    అంతే కాకుండా ఎన్టీఆర్ భవన్ పై దాడి చేసిన వారిలో 10మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పవన్, శేషగిరి, అడపాల గణపతి, జోగ రమణ, షేక్ అబ్దుల్లా, కోమటిపల్లి దుర్గారావు, పానుగంటి చైతన్య, గోక దుర్గాప్రసాద్, పేరూరి అజయ్, పల్లపు మహేష్ అనే వ్యక్తులను గుర్తించారు. అలాగే టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి జరిగిన కేసులో 11 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
    Published by:Sharath Chandra
    First published: