హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Pachayat elections: గ్రామ సచివాలయాలు, వాలంటీర్లకు ఎస్ఈసీ షాక్., పంచాయతీ ఎన్నికల వేళ కీలక ఆదేశాలు

AP Pachayat elections: గ్రామ సచివాలయాలు, వాలంటీర్లకు ఎస్ఈసీ షాక్., పంచాయతీ ఎన్నికల వేళ కీలక ఆదేశాలు

పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి 21తో ముగుస్తాయి. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు.

పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి 21తో ముగుస్తాయి. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) రాష్ట్ర ప్రభుత్వానికి మరో షాకిచ్చారు. ఇప్పటికే 9 మంది ఉన్నతాధికారులను బదిలీ చేసిన ఆయన., ఇప్పుడు గ్రామ సచివాలయ (Village Secretariat) సిబ్బంది, గ్రామ వాలంటీర్లకు ( Grama Volunteers) కీలక ఆదేశాలిచ్చారు.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి మరో షాకిచ్చారు. ఇప్పటికే 9 మంది ఉన్నతాధికారులను బదిలీ చేసిన ఆయన., ఇప్పుడు గ్రామ సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లకు కీలక ఆదేశాలిచ్చారు. పంచాయతీ ఎన్నికల విధులకు గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు దూరంగా ఉండాలని ఉత్తర్వులు జారీ చేశారు. వాలంటీర్లుగా ఉన్న ఉద్యోగస్తులంతా ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లను తిరిగిచ్చేయాలని., అలాగే వాలంటీర్లెవరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల మందికి పైగా గ్రామ వాలంటీర్లు., దాదాపు 60వేల మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ అమలులో ఉన్నంతకాలం ఈ ఆదేశాలు అమలో ఉంటాయని ఎస్ఈసీ స్పష్టం చేశారు.

ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన వెంటే 9 మంది అధికారులను బదిలీ చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ తో పాటు, జిఏడీ పొలిటికల్ సెక్రటరీకి లేఖ రాశారు. బదిలీ చేసిన వారిలో గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీ, శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలు, నలుగురు సీఐలను ఉన్నారు. గతంలో రాసిన లేఖ విషయాన్ని కూడా తాజా లేఖలో ఎస్‌ఈసీ ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. గత ఏడాది మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ సందర్భంగా అధికారులను బదిలీ చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 22న చర్యలు చేపట్టింది. తనకున్న విచక్షణాధికారాలతో కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ వారిని తొలగించారు.

గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్‌ ఎస్పీ, పలమనేరు డీఎస్పీ, శ్రీకాళహస్తి డీఎస్పీ, మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా, గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ నుంచి ఆయా జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు బాధ్యతలు తీసుకోవాలని.. తిరుపతి అర్బన్‌ ఎస్పీ చిత్తూరు ఎస్పీకు చార్జ్‌ అప్పగించాలని సూచించారు. సుప్రీం తీర్పు వచ్చిన అనంతరం పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేదీ, కమీషనర్ గిరిజా శంకర్ బదిలీ ప్రతిపాదనలు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరస్కరించారు. ఎన్నికల ప్రక్రియ కీలక దశలో ఉన్నందున బదిలీలు సరికావని ఆయన స్పష్టం చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap grama sachivalayam, Ap local body elections, Gram Panchayat Elections, Gram volunteer, Nimmagadda Ramesh Kumar