Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH STANDS TOP IN EASE OF DOING BUSINESS IN THE COUNTRY FULL DETAILS HERE PRN

AP No.1: జాతీయ స్థాయిలో సత్తాచాటిన ఏపీ.. పెట్టుబడుల్లో టాప్.. జగన్ సర్కార్ సరికొత్త రికార్డు..

ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం జగన్

పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ప్రభుత్వం మరోసారి సత్తా చాటింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ (Ease of doing Business) లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020లో ఏపీ టాప్ ప్లేస్ సాధించింది.

ఇంకా చదవండి ...
    పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ప్రభుత్వం మరోసారి సత్తా చాటింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ (Ease of doing Business) లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020లో ఏపీ టాప్ ప్లేస్ సాధించింది. కేంద్ర ప్రభుత్వం టాప్ ఎచీవర్స్ పేరుతో ఏడు రాష్ట్రాలను ప్రకటించగా.. అందులో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్రం లెక్కల ప్రకారం ఏపీ 97.89 శాతం స్కోర్ సాధించగా.. 97.77 శాతం స్కోర్ తో గుజరత్ రాష్ట్రం రెండో స్థానాన్ని సాధించింది. తమిళనాడు 96.97 శాతం, తెలంగాణ 94.86 శాతం స్కోర్ సాధించింది. టాప్ అచివర్స్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు గుజరాత్, హర్యానా, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు చోటు సంపాదించాయి.

    కేంద్రం రాష్ట్రాలకు 4 కేటగిరీలుగా విభజించి ర్యాంకులు కేటాయించింది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొత్త విధానాలతో కేంద్రం ర్యాంకింగ్ ప్రక్రియను చేపట్టింది. ర్యాంకుల కేటాయింపు కోసం కేంద్రం మొత్తం 10, 200 మంది పెట్టుబడిదారులు, స్టేక్ హోల్డర్ల నుండి అభిప్రాయాల సేకరించింది. అన్ని రంగాల్లోనూ ఏపీ ప్రభుత్వంపై పెట్టుబడిదారులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వేలో తేలింది. కేంద్రం ఇచ్చిన ర్యాంకులపై ఏపీ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.


    ఇది చదవండి: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాక్.. ఇకపై అవన్నీ రద్దు..!


    టాప్‌ అచివర్స్‌లో ఏపీతో పాటు గుజరాత్‌, హర్యానా, కర్నాటక, పంజాబ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఉండగా.., అచివర్స్‌ లిస్టులో హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలున్నాయి. ఇక అస్పిరర్స్ జాబితాలో అసోం, ఛత్తీస్‌గఢ్‌, గోవా, జార్ఖండ్‌, కేరళ, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌ ఉన్నాయి. అలాగే ఎమర్జింగ్ బిజినెస్ ఎకోసిస్టమ్స్ కేటగిరీలో 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో ఢిల్లీ, పుదిచ్చేరి, త్రిపుర ఉన్నాయి.



    ఇదిలా ఉంటే ఇటీవల ఏపీ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడం కోసం సరికొత్త పాలసీలను అమలు చేస్తోంది. పారిశ్రామిక వేత్తలకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు మంజూరు చేస్తోంది. అలాగే భూ కేటాయింపులు, ఇతర సౌకర్యాలను ఎలాంటి ప్రయాసలు లేకుండాలే కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే పెట్టుబడిదారులకు అనవైన రాష్ట్రంగా ఏపీ ఉందని ప్రభుత్వం తెలిపింది. ఇటీవల సీఎం జగన్ దావోస్ టూర్ ద్వారా దాదాపు రెండు లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయి. ఇందులో గ్రీన్ ఎనర్జీలోనే లక్షకోట్లకు పైగా ఒప్పందాలు జరిగాయి. అలాగే దావోస్ టూర్ లో ప్రముఖ ఎడ్యుకేషనల్ యాప్ బైజూస్ సీఈఓతోనూ భేటీ అయిన సీఎం జగన్.. నెలరోజుల తిరగక ముందే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు బైజూస్ యాప్ ను అందించేలా ఆ సంస్థలో ఒప్పందు కుదుర్చుకున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, Investments

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు