Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH STANDS NUMBER ONE IN AQUA EXPORTS AS AMERICANS LIKES AP PRAWNS FULL DETAILS HERE PRN

Andhra to America: ఏపీ నుంచి ఇవి వెళ్తే అమెరికా వాళ్లకు పండగే... లొట్టలేసుకొని తింటారు..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Aqua Products: ఆక్వా ఉత్పత్తులకు కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh). ఏపీకి ముఖ్యమైన ఆదాయ వనరుల్లో (AP Income Sources) ఆక్వా సాగు ఒకటి. చేపలు (Fish), రొయ్యల (Prawns) సాగు రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది.

    మనదేశం నుంచి చాలా ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్త్తులు ఎక్కువగా ఇతర దేశాలకు ఎక్స్ పోర్ట్ చేస్తుంటారు.  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నుంచి కూడా మామిడి (Mango), మిరపకాయ (Mirchi) వంటివి ఎగుమతి అవుతుంటాయి. అలాగే ఆక్వా ఉత్పత్తులకు (Aqua Products) కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. ఏపీకి ముఖ్యమైన ఆదాయ వనరుల్లో ఆక్వా సాగు ఒకటి. చేపలు (Fish), రొయ్యల (Prawns)సాగు రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది. దేశంలో ఆక్వా ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఏటా అక్వా ఎగుమతుల్లోనూ ఏపీనే టాప్. విదేశాల్లో రొయ్యలకు ఎక్కడాలేని డిమాండ్ ఉంది. ముఖ్యంగా అమెరికా (United States of America) వంటి దేశాల్లో మన రొయ్యలంటే అక్కడి జనం పడిచస్తారు. లొట్టలేసుకొని మరీ ఆరగిస్తారు. ఆంధ్రా నుంచి ఆక్వా ఎగుమతుల్లో మూడొంతులు అమెరికాకే వెళ్తున్నాయి. కరోనా వైరస్ ఆక్వా రంగంపై తీవ్రప్రభావం చూపినా... ఇటీవల మళ్లీ పుంజుకుంది. దీంతో ఎగుమతులు భారీగా పెరిగాయి. అమెరికా వంటే దేశాలు మన రొయ్యలపై ఆసక్తి చూపిస్తుండటంతో ఆదాయం కూడా ఆలాగే సమకూరుతోంది.

    గత ఏడాది ఇండియా నుంచి రూ.43,717.26 కోట్ల విలువైన 11.50 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. 2019–20తో పోలిస్తే 2020-21లో ఎగుమతులు 10.81 శాతం, విలువలో 6.31 శాతం తగ్గుదల నమోదైంది. అంతకు ముందు రూ.15,832 కోట్ల విలువైన 2,93,314 టన్నుల ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులతో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ పరిమాణంలో 4.54 శాతం, విలువలో 2.15 శాతం తగ్గింది.

    ఇది చదవండి: రైతుల కోసం ఇంజనీరింగ్ విద్యార్థుల అద్భుత సృష్టి.. నీటికష్టాలకు చెక్ పడినట్లే..!


    భారత్ నుంచి ఎగుమతయ్యే ఆక్వా ఉత్పత్తుల్లో 36 శాతంతో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలవగా.., తమిళనాడు 13 శాతం, కేరళ, 10 శాతంతో గుజరాత్‌ తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఎగుమతుల విలువ పరంగా చూస్తే... 24 శాతంతో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలవగా.. 18 శాతంతో గుజరాత్ రెండో స్థానంలో.. 14 శాతంతో కేరళ మూడో స్థానంలో 10 శాతంతో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తరువాత స్థానాల్లో నిలిచాయి. ఎగుమతుల పరిమాణం, విలువలో ఇతర రాష్ట్రాలు ఏపీ దరిదాపుల్లో కూడా లేవు.

    ఇది చదవండి: గోమాతంటే ఆ రైతుకు ఎంతప్రేమో.. ఆవుదూడకు ఘనంగా బర్త్ డే వేడుకలు..


    అమెరికాకే ఎక్కువ..!
    భారత్ ఆక్వా ఎగుమతుల్లో అమెరికాకు 25 శాతం, చైనాకు 19శాతం, ఈస్ట్ ఏషియా దేశాలకు 13శాతం, యూరప్ కు 13శాతం, జపాన్ కు 8శాతం, మిడిల్ ఈస్ట్ దేశాలకు 2 శాతం, ఇతర దేశాలకు 12శాతం చొప్పున ఎగుమతి అవుతున్నాయి. ఇక ఏపీ ఎగుమతి చేసే ఆక్వా ఉత్పత్తుల్లో దాదాపు 71శాతం అమెరికాకు, 12.74 శాతం చైనాకు. యూరోపియన్ దేశాలకు 4.54 శాతం,3.51 శాతం మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు, 2.92 శాతం సౌత్‌ ఈస్ట్‌ ఆసియా దేశాలకు వెళ్లాయి. ఇక ఫ్రోజెన్ ష్రింప్ (రొయ్యలు) ఎగుమతుల్లో 97.20 శాతం ఆంధ్రప్రదేశ్‌ నుంచే జరగడం విశేషం.  దేశంలో 10 పోర్టుల ద్వారా రూ.43,717.26 కోట్ల విలువైన 11,49,341 టన్నుల ఎగుమతులు జరిగితే... అందులే రూ.16,124.92 కోట్ల విలువైన 2,80,687 టన్నుల మత్స్య ఎగుమతులు ఏపీలోని పోర్టుల నుంచే వెళ్లాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: America, Andhra Pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు