హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Government: జాతీయ స్థాయిలో సీఎం జగన్ రికార్డు.. వరుసగా మూడోసారి టాప్ ప్లేస్..

AP Government: జాతీయ స్థాయిలో సీఎం జగన్ రికార్డు.. వరుసగా మూడోసారి టాప్ ప్లేస్..

జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మరోసారి సత్తా చాటింది. స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో మరోసారి టాప్ ర్యాంక్ దక్కించుకుంది. ఏపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ఈ ఘనత సాధించింది.

జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మరోసారి సత్తా చాటింది. స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో మరోసారి టాప్ ర్యాంక్ దక్కించుకుంది. ఏపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ఈ ఘనత సాధించింది.

జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మరోసారి సత్తా చాటింది. స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో మరోసారి టాప్ ర్యాంక్ దక్కించుకుంది. ఏపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ఈ ఘనత సాధించింది.

  జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం మరోసారి సత్తా చాటింది. స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో మరోసారి టాప్ ర్యాంక్ దక్కించుకుంది. ఏపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ఈ ఘనత సాధించింది. ముఖ్యంగా సుపరిపాలనలో ఏపీ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ లిస్ట్ లో తెలంగాణ (Telangnala) కూడా ఏపీ దరిదాపుల్లో లేదు. సుపరిపాలనలో ఏపీ ఒక్కటే టాప్-5లో ఉండగా.. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం కూడా ఈ ఘనత సాధించలేదు. ఏపీ తర్వాత రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్, మూడవ స్థానంలో ఒడిశా, నాలుగో స్థానంలో గుజరాత్ ఉండగా.. మహారాష్ట్ర ఐదో స్థానంలో నిలిచింది. ఈ లిస్ట్ లో ఉత్తరప్రదేశ్‌-7, మధ్యప్రదేశ్‌-8, అస్సాం-9, హిమాచల్‌ప్రదేశ్‌ -10, బీహార్‌ -11, హర్యానా – 12వ స్థానాల్లో నిలిచాయి.

  దేశంలో ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న పరిపాలనా విధానాలు, తీసుకొస్తున్న కొత్త సంస్కరణలు, ప్రజల సంక్షేమం కోసం అమలు చేసత్న్న పథకాలతో పాటు పలు అంశాలపై ప్రతి ఏడాది స్కోచ్ సంస్థ అధ్యయనం చేస్తోంది. ఈ సర్వేలో గత మూడేళ్లుగా ప్రభుత్వం అగ్రస్థానంలో నిలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థతో ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు, పథకాలను చేరవేస్తోంది. అలాగే పాఠశాలల్లో నాడు-నేడు కింద మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి కార్యక్రమాలు చేపడుతోంది. ఈ అంశాలన్నీ గ్రామీణాభివృద్ధిలో ఏపీ మెరుగైన ర్యాంకులో నిలిచేందుకు తోడ్పడ్డాయి.

  ఇది చదవండి: ఏపీ రాజకీయాల్లోకి మరో నటి.. ఏకంగా రోజాపైనే పోటీకి సిద్ధం..

  ఇక పోలీస్ వ్యస్థలోనూ ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. పోలీస్ డిపార్ట్ మెంట్ లో టెక్నాలజీ వాడకాన్ని పెంచడం, నేరాలను అరికట్టేందుకు, అవి జరిగిన తర్వాత నేరస్తులను పట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం అవలంభిస్తున్న టెక్నాలజీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అతేకాకుండా దిశ యాప్ ద్వారా మహిళల రక్షణకు పెద్దపీట వేయడం సర్వే దృష్టిని ఆకర్షించింది.

  ఇది చదవండి: కేసీఆర్ ప్రకటనతో జగన్ పై ఒత్తిడి..! ఏపీ సీఎం వ్యూహంపై సస్పెన్స్.. ఆ మాట గుర్తుచేస్తున్న ప్రతిపక్షాలు

  వ్యవసాయ రంగంలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు దేశంలోనే తొలిస్థానంలో నిలిచాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా నిత్యం రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించడంతో పాటు విత్తనాల సరఫరా దగ్గర నుంచి పంటలు విక్రయించే వరకు ప్రతి అంశంలోనూ ప్రభుత్వమే రైతులను గైడ్ చేస్తోంది. అలాగే రైతు భరోసా పథకం, నష్టం జరిగిన సీజన్లోనే ఇన్ పుట్ సబ్సీడీ అందించడం వంటి కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

  ఇది చదవండి: అదో పెద్ద కామెడీ.. సీఎం జగన్ కు టాలీవుడ్ సన్మానంపై జనసేన కామెంట్..!

  ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతన్నందున.. ఈ మూడేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉత్తమంగా రాణించడంపై ప్రభుత్వ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొన్ని అంశాల్లో విమర్శలెదుర్కొంటున్న జగన్ సర్కార్ కు స్కోచ్ అవార్డులు ఊతమిచ్చాయని చెప్పుకోవచ్చు. ఎన్నికలకు మరో రెండేళ్లుండటంతో ఇలాంటి ర్యాంకులు ప్రజల్లోకి వెళ్లేందుకు మరింత ఉత్సాహాన్నిస్థాయని వైసీపీ వర్గాలు కూడా అంటున్నాయి.

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government

  ఉత్తమ కథలు