Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH STANDS IN 3RD PLACE IN AMRIT SAROVAR PROGRAM NATIONWIDE FULL DETAILS HERE PRN

AP Government: జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న ఏపీ.. ఆ విషయంలో 13 నుంచి 3వ స్థానానికి చేరిక

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

కేంద్రం ప్రభుత్వం (Central Government)s నిర్దేశించిన కొన్ని కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ప్రభుత్వం చురుగ్గా ముందుకెళ్తోంది. ఇప్పటికే కొన్ని అంశాల్లో జాతీయ స్థాయిలో టాప్ లో కొనసాగుతున్న జగన్ సర్కార్.. మరో అంశంలో ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేదిశగా ముందడుగులు వేస్తోంది.

ఇంకా చదవండి ...
    కేంద్రం ప్రభుత్వం (Central Government)s నిర్దేశించిన కొన్ని కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ప్రభుత్వం చురుగ్గా ముందుకెళ్తోంది. ఇప్పటికే కొన్ని అంశాల్లో జాతీయ స్థాయిలో టాప్ లో కొనసాగుతున్న జగన్ సర్కార్.. మరో అంశంలో ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేదిశగా ముందడుగులు వేస్తోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న చెరువులను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ కార్యక్రమంలో ఏపీ దేశంలోనే మూడోస్థానంలో కొనసాగుతోంది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో 75 చెరువులను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఈఏడాది ఏప్రిల్ 24న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

    ఇందులో భాగంగా కనీసం ఒక ఎకరం విస్తీర్ణంలో ఉండి.., పది వేల క్యూబిక్‌ మీటర్ల మేర నీరు నిల్వ చేసే సామర్థ్యంతో చెరువులను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల ఆధ్వర్యంలో ఉన్న 2,890 చెరువులను అభివృద్ధి చేయడం, కొత్తవి నిర్మించడం వంటివి చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్లుగానే ఇప్పటికే 1,809 చెరువుల పనులను మొదలుపెట్టింది. 2023 ఆగస్టు నాటికి చెరువుల నిర్మాణాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. తొలిదశలో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి 399 చెరువుల నిర్మాణం పూర్తి చేస్తామని పంచాయతీరాజ్‌- గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్, శాంతిప్రియ పాండే తెలిపారు.

    ఇది చదవండి: ఏపీ సర్కార్ మరో పథకం.. వారి ఖాతాల్లోకి రూ.10వేలు.. వివరాలివే..!


    అమృత్ సరోవర్ కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన నివేదిక ప్రకారం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 181 చెరువులను పూర్తి చేసి దేశంలోనే మూడేస్థానంలో ఉంది. ఈ జాబితాలో ఏపీ కంటే ముందు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలున్నాయి. కార్యక్రమం మొదలైనప్పుడు ఏపీ 13వ స్థానంలో ఉండగా.. తాజా రిపోర్ట్ ప్రకారం మూడోస్థానానికి చేరుకుంది. అమృత్ సరోవర్ కార్యక్రమంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దృష్టిపెట్టింది. దీనిపై సీఎస్ సమీర్ శర్మ వారం వారం సమీక్షలు జరుపుతూ శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆగస్టు 15 నాటికి నిర్మాణం పూర్తైన చెరువుల వద్దద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని చెపట్టనున్నారు.


    ఇది చదవండి: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సుల్లో ఆ సమస్యకు చెక్.. ఆర్టీసీ వినూత్న ఆలోచన..!


    ఇదిలా ఉంటే ఇటీవల రాష్ట్రప్రభుత్వం జాతీయ స్థాయిలో మెరుగైన పనితీరును కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ ప్రభుత్వం నెంబర్ వన్ ర్యాంక్ సాధించింది. ఈ జాబితాలో గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కూడా ఏపీ కంటే వెనుకబడి ఉన్నాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap government

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు