Tammineni Sitaram: ఏపీ స్పీకర్ తమ్మినేనికి తృటిలో తప్పిన ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస మండలం వాకలవలస వద్ద తమ్మినేని సీతారామ్ ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది.

news18-telugu
Updated: November 21, 2020, 3:13 PM IST
Tammineni Sitaram: ఏపీ స్పీకర్ తమ్మినేనికి తృటిలో తప్పిన ప్రమాదం..
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం(ఫైల్ ఫొటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస మండలం వాకలవలస వద్ద తమ్మినేని సీతారామ్ ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. రాజోలు-పంజంగి మధ్యలో తమ్మినేని కారుకు ఆటో అడ్డుగా రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులకు గాయాలు అయినట్టుగా సమాచారం. ఆటోను ఢీకొట్టిన తర్వాత స్పీకర్ కారు పొలాల్లోకి దూసుకెళ్లడంతో స్పల్ఫంగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో స్పీకర్ తమ్మినేనికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక, తమ్మినేని సీతారామ్ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985లో ప్రభుత్వ విప్‌గా పనిచేసిన ఆయన, 1994లో చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత చిరంజీవి సారథ్యంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరిన తమ్మినేని... ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన వైసీసీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన తమ్మినేని ఓడిపోయారు. 2019లో మళ్లీ వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. ఉత్తరాంధ్ర నుంచి సీనియర్ నాయకుడిగా ఉన్న ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
Published by: Sumanth Kanukula
First published: November 21, 2020, 3:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading