హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tension in Assembly: నేనేమీ గౌతమ బుద్దుడిని కాదు.. టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ రూలింగ్

Tension in Assembly: నేనేమీ గౌతమ బుద్దుడిని కాదు.. టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ రూలింగ్

టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ రూలింగ్

టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ రూలింగ్

Tension in Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులపై స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏమీ గౌతమ బుద్దుడిని కాదు అన్నారు.. శ్రీరాముడు దేవుడే అయినా.. రావణాసురుడ్ని వధించలేదా అంటూ రామాయణం వినిపించారు..ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Tension in Assembly:  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (Andhra Pradesh Assembly) లో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార వైసీపీ (YCP), ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం (Telugu Desam) నేతలు సభా వేదికగా కొట్టుకున్నారు. ఇన్నాళ్లు మాటల యుద్ధానికే పరిమితమైన రాజకీయం.. నేడు రణరంగాన్ని తలపించింది. అయితే దీనిపై ఇంకా మాటల మంటలు కొనసాగుతునే ఉన్నాయి. వైసీపీ నేతలే తమపై దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తుంటే.. ప్రతిపక్ష నేతలే మతపై దాడి చేశారని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఎవరి వాధన ఎలా ఉన్నా తాజా ఘటనపై స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Seetaram) ఘాటుగా స్పందించారు. తనపై టీడీపీ సభ్యులు అనుచితంగా ప్రవర్తించడం పట్ల స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభలో టీడీపీ నేతలు చేసిన దౌర్జన్యాన్ని తప్పు పట్టారు. తాను ఏమీ గౌతమ బుద్దుడు కాదన్నారు. ఇకపై పోడియం దగ్గరకు వస్తే ఆటోమెటిక్‌ సస్పెన్షన్‌ చేస్తానని స్పీకర్‌ రూలింగ్‌ ఇచ్చారు. టీడీపీ సభ్యులు సభను అగౌరవ పరిచారడం దారుణమన్నారు. సభలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన హేయమైన చర్యగా అభివర్ణించారు. టీడీపీ సీనియర్‌ సభ్యులే తనపై దాడులు చేయడం దురదృష్టకరమన్నారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే..? తనపై దురుసుగా ప్రవర్తించడమేనా సీనియారిటీ అంటూ టీడీపీ నేతలను ప్రశ్నించారు. బడగు, బలహీన వర్గాలంటే ఇంత చిన్న చూపా అని నిలదీశారు. సభలో స్పీకర్ అంటే ఒక గౌరవం ఉంటుందని.. అది టీడీపీ నేతలకు తెలియదా అని ఆవేదన వ్యక్తం చేశారు. తన చైర్‌ వద్దకు వచ్చే హక్కు సభ్యులకు లేదని స్పష్టం చేశారు. సభలో ఉన్న సభ్యులు అంతా తనకు సమానమేనన్నారు. సభలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదని మండిపడ్డారు. స్పీకర్‌ చైర్‌ను టచ్‌ చేసి ముఖంపై ప్లకార్డులు ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత జరిగినా టీడీపీ సభ్యుల వైఖరిని మౌనంగానే భరించానని.. ఇంకా భరించడానికి తాను గౌతమ బుద్దుడిని కాదు అన్నారు.

ఇదీ చదవండి : ఏపీ అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. వైసీపీ కౌంటర్ ఇదే

అసెంబ్లీలో దాడులు చేయమని టీడీపీ సభ్యులకు ఎవరైనా చెప్పారా..? వారి ప్లాన్స్ ఏవైనా కావొచ్చు సభను సజావుగా నడిపించడమే తన కర్తవ్యం అన్నారు. సభలో ఉన్న అందరి సభ్యుల హక్కులు పరిరక్షించడం తన బాధ్యత అన్నారు. టీడీపీ నేతలు పేపర్లు చించి తనపై వేస్తుంటే.. పూలు చల్లుతున్నారనే భావించాను అన్నారు. ఎమ్మెల్యే ఎలీజాను టీడీపీ సభ్యులు నెట్టేశారని.. సభా సమయం, ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో రోజాను ఏడాది సస్పెండ్‌ చేశారు. సభలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తారు. టీడీపీ నేతల తీరు మారాలి అని స్పీకర్ సీరియస్ అయ్యారు. అంతేకాదు శ్రీరాముడిని మనం అంతా దేవుడు అంటాం.. అయినా ఆయన రావణుడ్ని వధించారని.. ఓ రామయణ కథ కూడా చెప్పారు. తనకు ఈ పేరు పెట్టినందుకు ఎప్పుడూ తన తల్లిదండ్రులకు ధన్యవాదాలు చెప్పుకుంటాను అన్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP Assembly, AP News, AP Speaker Tammineni Seetharam

ఉత్తమ కథలు