ఎంపీ కృష్ణంరాజుపై ఏపీ స్పీకర్ తమ్మినేని ఆసక్తికర వ్యాఖ్యలు..

ఎంపీ కృష్ణంరాజు తీరు ఆ పార్టీ అగ్రనేతలకు అస్సలు మింగుడు పడటం లేదు. అంతకుముందు పార్టీ తరఫున షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు.

news18-telugu
Updated: July 5, 2020, 1:45 PM IST
ఎంపీ కృష్ణంరాజుపై ఏపీ స్పీకర్ తమ్మినేని ఆసక్తికర వ్యాఖ్యలు..
తమ్మినేని సీితారాం(ఫైల్ ఫోటో)
  • Share this:
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆ పార్టీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎంపీ కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఎంపీలంతా లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఎంపీ కృష్ణంరాజుపై ఇటీవల ఫిర్యాదు చేశారు. తాజాగా ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగానే రఘురామకృష్ణంరాజు విమర్శలు చేస్తున్నారన్నారన్నారు. పార్టీ నచ్చకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవచ్చని సూచించారు. రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌ మారిన విషయం తెలిసిందే. వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ప్రతి విషయంపై ఏపీవాసులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.

ఎంపీ కృష్ణంరాజు తీరు ఆ పార్టీ అగ్రనేతలకు అస్సలు మింగుడు పడటం లేదు. అంతకుముందు పార్టీ తరఫున షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ తాజా వ్యాఖ్యలు చేశారు. ఇక న్యాయ వ్యవస్థపై మరోసారి ఆయన వ్యాఖ్యానించారు. ఒక వ్యవస్థలో మరో వ్యవస్థ జోక్యం సరికాదని వ్యాఖ్యానించారు. సూచనలివ్వాలేగాని.. నిర్ణయాలు తీసుకోవడం సరికాదని కుండబద్ధలు కొట్టారు. ఒక్కరి వల్ల స్థానిక ఎన్నికలు ఆగిపోయాయని నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడడం గమనార్హం.
Published by: Narsimha Badhini
First published: July 5, 2020, 1:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading