ఏపీలో రాజకీయంగా అందరికీ ఎప్పటికీ గుర్తుండే డైలాగ్ బీకాంలో ఫిజిక్స్.. మాజీ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఈ డైలాగ్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు. ఇప్పటికీ ఆ డైలాగ్ ను ఎవరూ మరిచిపోలేదు. తాజాగా అలాంటి కామెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం.. ఇంతకీ ఆయనేమన్నారంటే.. మనం పెంచే మొక్కలు ఆక్సిజన్ ను పీల్చుకుని.. బయటకు కార్బన్ డయాక్సైడ్ను విడుదలచేస్తాయి అన్నారు. ఇదేంటి మనం అంతా పచ్చని చెట్లు ప్రాణవాయువును అందిస్తాయని చదువుకున్నాం.. మని స్పీకర్ ఏంటి అలా అనుకుంటున్నారు.. ఏదో పొరపాటుగా నోరు జారి ఉంటారు అనుకుంటున్నారు.. కాదు ఆయన మాత్రం తన కామెంట్లను వెనక్కు తీసుకోవడం లేదు. తనను విమర్శించే వారంతా ముందు మొక్కలు నాటి చూపించండి అప్పుడు మాట్లాడండి అంటూ రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు..
ఇటీవల శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం కురిమిపేటలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని మొక్కలు నాటారు. అందులో భాగంగా మాట్లాడిన ఆయన కళకళలాడే పచ్చని చెట్లు ఆక్సిజన్ ను ఎక్కువగా పీల్చుకుంటాయని.. కార్బన్ డై ఆక్సైడ్‌ను బయటకు విడిచి పెడతాయి. అందుకే ఆకాశం మేఘావృతమై వర్షాలు పడతాయని కొత్త అర్థం చెప్పారు. అక్కడితో ఆగకుండా దాని కారణంగానే వర్షాలు పడతాయంటూ తమ్మినేని తనదైన శైలిలో సందేశమిచ్చారు.
ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక అక్కడ ఉన్న అధికారులు తెల్లమొహం వేస్తే.. తనను విమర్శంచడం కాదు. అందరూ వందేసి మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి.. ఆ తరువాత తనపై విమర్శలు చేయండి అంటున్నారు. దీంతో ప్రస్తుతం స్పీకర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు మరో బీకాంలో ఫిజిక్స్ నేత దొరికారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. స్పీకర్ దగ్గర కొత్ పాఠాలు నేర్చుకోవాలేమో అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Speaker Tammineni Seetharam