HOME »NEWS »ANDHRA PRADESH »andhra pradesh sonu sood saved 8 months old boy life paid heart operation fee west godawari district here are the details prn

Sonu Sood: వారికి దేవుడంటే సోనూ భాయే.., ఒక్క ట్వీట్ తో మారిన జీవితం

Sonu Sood: వారికి దేవుడంటే సోనూ భాయే.., ఒక్క ట్వీట్ తో మారిన జీవితం
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 8నెలల చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించిన సోనూ సూద్

కష్టమనే మాట వినిపిస్తే చాలు అక్కడ సోనూ సూద్ (Sonu Sood) ప్రత్యక్షం అవుతున్నాడు. ఒక్క ట్వీట్ తో 8నెలల చిన్నారికి పునర్జన్మను ప్రసాదించాడు.

  • Share this:
    కష్టమనే మాట వినిపిస్తే చాలు అక్కడ సోనూ సూద్ ప్రత్యక్షం అవుతున్నాడు. లాక్ డౌన్ సమయంలో వేలాది మంది వలక కార్మికులకు అండగా నిచారు సోనూ సూద్. సొంతూళ్లకు వెళ్లే కార్మికులకు ప్రత్యేక బస్సులు, రైళ్లు, ప్లైట్లు బుక్ చేసి మరీ వారిని ఇళ్లకు పంపించారు. అప్పటి నుంచి కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నాడు. వైద్యం, చదువులు, ఉద్యోగాలు, ఇళ్లు ఇలా ఏ కష్టమున్నా ఇప్పుడు గుర్తొచ్చే పేరు సోనూ సూద్. మొన్నా మధ్య ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో రైతుకు ట్రాక్టర్ కొనిచ్చిన సోనూ.. సొంతగా రోడ్డు వేసుకున్న విజయనగరం జిల్లా కొదమ గ్రామ గిరిజనులకు సాయమందిస్తానని ప్రకటించారు. అలాగే ఇటీవల కృష్ణాజిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి ఆపద్బాంధవుడిలా నిలిచాడు. తాజా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 8నెలల చిన్నారికి హార్ట్ ఆపరేషన్ చేయించి పునర్జన్మను ప్రసాదించాడు.

    ఒక్క ట్వీట్ తో ఆపరేషన్



    ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామనికి చెందిన రామన వెంకటేశ్వరరావు, దేవి దంపతుల 8 నెలల కుమారుడికి గుండెలో సమస్య వచ్చింది. ఆపరేషన్ కు వీరికి శస్త్రచికిత్స చేయించే ఆర్థిక పరిస్థితి లేదు. 6 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో అంత స్థోమతలేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఐతే ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన కొఠారి శ్రీనివాస్‌ అనే వ్యక్తి కుమారుడు షణ్ముఖ.. వారి వివరాలను సోనూ సూద్‌ కు ట్విట్టర్ ద్వారా తెలిపి సాయం చేయాలని కోరాడు. వెంటనే స్పందించిన సోనూసూద్ ముంబయిలోని ఎస్‌ఆర్‌సీసీ ఆసుపత్రిలో జనవరి 9న.. ఆపరేషన్ చేయించారు. దీనికి సంబంధించిన రూ.6 లక్షలు బిల్లును సోనుసూద్ చెల్లించారు. దీంతో తమ బాబుకు పునర్జన్మనిచ్చిన సోనూ సూద్ కు వెంంకటేశ్వరరావు-దేవి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.





    గతంలో కృష్ణాజిల్లా విజయవాడ, తిరువూరుకు చెందిన ఇద్దరు చిన్నారులకు సోనూసూద్ సాయమందించారు. ఓ చిన్నారికి రూ.5 లక్షలు, మరో చిన్నారికి రూ.4.50 లక్షలతో ముంబైలోనే ఆపరేషన్లు చేయించాడు సోనూ భాయ్. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న ఆచార్య సినిమాలో సోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. షూటింగ్ సమయంలో సిబ్బందికి 100 స్మార్ట్ ఫోన్లు కొనిచ్చాడు. ఇక సోనూసూద్ చేసిన సాయాలకు దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. విపత్తు మయంలో సోనూ చేసిన సేవా కార్యక్రమాలను ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు. అంతేకాదు ఆయన్ని పలు అవార్డులతో సత్కరిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి కూడా సోనూ సూద్ కు పురస్కారాన్ని ప్రకటించింది. ప్రతి రోజూ సోనూ సూద్ చేసిన కృషికి పురస్కారాలు వరిస్తూనే ఉన్నాయి.
    Published by:Purna Chandra
    First published:January 24, 2021, 09:04 IST

    टॉप स्टोरीज