హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: నెలకు 40 రూపాయల పెన్షన్.., నాలుగు వాటాలు.. ఇదెక్కడి విడ్డూరం..?

Andhra Pradesh: నెలకు 40 రూపాయల పెన్షన్.., నాలుగు వాటాలు.. ఇదెక్కడి విడ్డూరం..?

అధికారుల లెక్కల ప్రకారం తెలంగాణ ఆదాయంలో 50 శాతం కేవలం సంక్షేమ పథకాలైన ఆసరా పెన్షన్లు, రైతు బంధు, ఇతర పథకాలకు సరిపోతుంది. దీంతోపాటు నిరుద్యోగ భృతిపై కూడా చర్చించారు.

అధికారుల లెక్కల ప్రకారం తెలంగాణ ఆదాయంలో 50 శాతం కేవలం సంక్షేమ పథకాలైన ఆసరా పెన్షన్లు, రైతు బంధు, ఇతర పథకాలకు సరిపోతుంది. దీంతోపాటు నిరుద్యోగ భృతిపై కూడా చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కొన్ని గ్రామాల్లో బ్రిటీష్ (British rule) వారి కాలంలో నిర్ణయించిన పెన్షన్ పథకం ఇప్పటికీ అమలవుతోంది. లబ్ధిదారులకు కనీసం వంద రూపాయల పెన్షన్ కూడా అందని పథకం అది.

ఓ కుటుంబానికి నెలనెలా పెన్షన్ వస్తుంటే వారికి పండగే..! ఎందుకంటే ప్రభుత్వానికి చేసినకు గుర్తింపు, వృద్ధాప్యంలో వారికి అండగా ఉండేందుకు ప్రభుత్వాలు పెన్షన్ ఇస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వేల రూపాయల్లో పెన్షన్ ఇస్తోంది. రాష్ట్రంలో వృద్ధులకు రూ.2,250, వితంతువులు, దివ్యాంగులకు రూ.3,250, దీర్ఘకాలిక వ్యాధిగస్తులకు రూ.10వేల వరకు పెన్షన్ వస్తోంది. కానీ ఓ జిల్లాలో కొన్ని కుటుంబాలకు పట్టుమని 50 రూపాయల పెన్షన్ కూడా రావడం లేదు. వేలల్లో ఉండే పెన్షన్.. అక్కడ వందల్లో కూడా లేదనుకుంటున్నారా..? మీరు చదివేది నిజమే..! ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో కొందరకి నెలకు 40 రూపాయల పెన్షన్ అందుతోంది. ఐతే ఈ కుటుంబాలు ప్రభుత్వ పెన్షన్ల పరిధిలోకి రారు.

వివరాల్లోకి వెళ్తే., బ్రిటీష్ వారి కలంలో రాయలసీమ ప్రాంతంలో పాలెగాళ్లు చిన్నచిన్న రాజ్యాలను పాలించేవారు. ముఖ్యంగా ఉయ్యాలవాడ, అవుకు, మైదుకూరు, కర్నూలు, మద్దికెర, పందికోన ఇలా 61 పాలెగాళ్ల రాజ్యాలుండేవి. ఒక్కో పాలెగాడి పాలనో 40 నుంచి 50 గ్రామాలుండేవి. ఈ పాలెగాళ్లు వ్యవసాయం చేయడంతో పాటు పన్నులు వసూలు చేసి గ్రామాలను అభివృద్ధి చేసేవారు. వారి రాజ్యంలో పాలెగాళ్లు చెప్పిందే వేదం. ఐతే బ్రీటిష్ వారు భారత్ కు వచ్చినప్పుడు వారి ఆధిపత్యానికి గండికొట్టారు. వారికి మెరుగైన సౌకర్యాలు, గౌరవభృతి ఇచ్చేలా చూస్తామని వారితో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం మేరకు రూపుదిద్దుకున్న పతకమే పాలెగాళ్ల పెన్షన్ పథకం. బ్రిటీష్ వారి కాలంలో నిర్ణయించిన పెన్షన్ ఇప్పటికీ కొనసాగుతోంది.

ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపు

కర్నూలు జిల్లా పత్తికొండ సబ్ ట్రెజరీ నుంచి పాలెగాళ్ల వారసులకు పెన్షన్లు వస్తున్నాయి. మద్దికెరలో రామప్పనాయుడుకు గతంలో రూ.19 రూపాయల పెన్షన్ వచ్చేది.ఆయన మృతి చెందడంతో ఆ పెన్షన్ నిలిచిపోయింది. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు పెన్షన్ పునరుద్ధరించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నా ఇంకా మంజూరు కాలేదు. అలాగే పందికోనలో పాలెగాళ్ల వారసులకు గతంలో రూ.91 పెన్షన్ వచ్చేది. ఐతే ఒప్పందం కన్నా ఎక్కువ చెల్లిస్తుండటంతో ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం ఆ కుటుంబంలో లక్ష్మీదేవి పేరిట రూ.41 పెన్షన్ వస్తోంది. దీనిని నలుగురు వరదరాజు, రంగపరాజు, రామస్వామి నాయుడు, రంగస్వామి రూ.10.25 చొప్పున పంచుకుంటున్నారు.

ఐతే ఈ పెన్షన్ విధానాన్ని మార్చాలని పాలెగాళ్ల వారసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమ పూర్వీకుల సేవలకు గుర్తింపుగా ఇస్తున్న పెన్షన్ కనీసం వృద్ధాప్య పెన్షన్ లో 10శాతం కూడా లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పెన్షన్ పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Andhra pradesh news, Britain, Kurnool, Pension Scheme, Pensioners, Rayalaseema, Ysr pension scheme

ఉత్తమ కథలు