• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • ANDHRA PRADESH SOFTWARE ENGINEERING MARRIED AFGHANISTAN GIRL IN VIJAYAWADA PRN

Andhra Pradesh: ఆంధ్రా weds ఆఫ్ఘనిస్తాన్.., ఒక్కటైన ప్రేమ జంట..!

Andhra Pradesh: ఆంధ్రా weds ఆఫ్ఘనిస్తాన్..,  ఒక్కటైన ప్రేమ జంట..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రేమకు హద్దులుండవ్. దానికి కులం, మతం, దేశం, ప్రాంతం అనే బేధాలుండవు. రెండు మనసులు కలిస్తేచాలు వేల కిలోమీటర్ల దూరమైన చిటికెలో కరిగిపోతుంది.

  • Share this:
    ప్రేమకు హద్దులుండవ్. దానికి కులం, మతం, దేశం, ప్రాంతం అనే బేధాలుండవు. రెండు మనసులు కలిస్తేచాలు వేల కిలోమీటర్ల దూరమైన చిటికెలో కరిగిపోతుంది. చదువుకునే రోజుల్లో వికసించిన ప్రేమ.. మరింత బలపడింది. ఆంధ్రా అబ్బాయి..., ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయి అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన రైల్వే డీఎస్పీ అశోక్ కుమార్, లక్ష్మీ మహేశ్వరిల కుమారుడు వివేకానంద రామన్.., బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఢిల్లీలో చదువుకునే రోజుల్లో తన క్లాస్ మేట్ అయిన ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయి ఫ్రోజ్ షరీన్ ను ప్రేమించాడు. అమ్మాయి కూడా ప్రేమను అంగీకరించడంతో ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా బలంగా నిలబడ్డారు.

    ప్రేమ విషయాన్ని ఇద్దరూ తమ తల్లిదండ్రులకు చెప్పారు. తొలుత కొంత ఆలోచించినా చివరకు ఒప్పుకున్నారు. దీంతో అంగరంగ ఇరు కుటుంబాలు దగ్గరుండి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాయి. హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగిన వివాహంలో మేళ తాళాల మధ్య వేవిక్..,, షిరీన్ మెడలో మూడు ముళ్లు వేశాడు. షిరిన్ కూడా అచ్చతెలుగు పెళ్లికూతురు లాగా తయారైంది. ప్రేమకు కులం, మతం, ప్రాంతాలతో సంబంధం లేదని వివేక్-షిరిన్ జంట నిరూపించింది.

    తమకు కుల మతాల పట్టింపులు లేవని అందుకే మన దేశానికి చెందిన అమ్మాయి కాకపోయినా తనని పెళ్లి చేసుకున్నానని వివేక్ తెలిపారు. అలాగే కలిసి జీవించేది పిల్లలు కాబట్టి వారి ప్రేమను అర్ధం చేసుకోని పెళ్లికి అంగీకరించినట్లు డీఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు కూడా సంతోషంగా అంగీకరించారని చెప్పారు.
    Published by:Purna Chandra
    First published: