ఆంధ్రప్రదేశ్‌లో ఆరు దిశ పోలీస్ స్టేషన్లకు లభించిన ISO సర్టిఫికెట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అత్యుత్తమ నాణ్యత, ప్రమాణాలతో కూడిన సేవలకు గాను, ఏపీలోని 6 దిశ పోలీస్‌స్టేషన్లకు లభించిన జీటౌ 9001:2015 సర్టిఫికెట్లను సీఎం జగన్ ఆవిష్కరించారు. సౌత్ ఇండియా ఐఎస్‌ఓ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎలియాజర్ సర్టిఫికెట్లు జారీని వివరించారు. విజయనగరం, రాజమండ్రి అర్బన్, విశాఖపట్నం సిటీ, నెల్లూరు, కర్నూలు, అనంతపూర్ పోలీస్‌స్టేషన్లకు జీటౌ 9001:2015 సర్టిఫికెట్లు లభించాయి. త్వరలో విజయవాడ సిటీ దిశ పోలీస్‌స్టేషన్‌కు కూడా సర్టిఫికెట్ రానుంది. ఈ సందర్భంగా 18 దిశ పోలీస్టేషన్ల సిబ్బందితో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల ఎస్పీలు, ఇతర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వారం రోజుల్లోనే 167 కేసులను డిస్పోజ్ చేసిన విషయం తెలుసుకున్న సీఎం వారిని అభినందించారు.
‘మనం వేయాల్సిన అడుగులు చాలా ఉన్నాయి. దిశ యాక్ట్, స్పెషల్ కోర్టుల కోసం మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను రేపటి లోగా నియమించమని చెప్పాం. అలాగే ఫోరెన్సిక్ సిబ్బంది నియామకం, నిర్మాణం కోసం నిధులు కూడా విడుదల చేశాం. ప్రతి దిశ పోలీస్‌స్టేషన్లలో కనీసం 50 శాతం మహిళలు ఉండేలా చూస్తారు. నెలకోసారి దిశ మీద సమీక్ష చేయాలని నిర్ణయించుకున్నాం. మన పోలీసులను గర్వంగా నిలబెట్టేది.. దిశ రూపంలో మనం చేస్తున్న ప్రయత్నాలే. మహిళలకు భద్రత కల్పించడానికి దిశ ద్వారా మనం ముందడుగు వేశాం. మనకు హోం మంత్రిగా మహిళ ఉన్నారు. సీఎస్ నీలం సాహ్ని కూడా మహిళే. అలాగే దిశ విభాగానికి ఉన్న ఇద్దరు అధికారులు కృతిక, దీపిక కూడా మహిళలే.’ అని సీఎం జగన్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP disha act, Disha police station