Andhra Pradesh: ఏపీ మహిళలు దేశంలోనే నెంబర్ వన్… ఏ విషయంలో అంటే...!

ప్రతీకాత్మకచిత్రం

మహిళలు తమకాళ్లపై తాము నిలబడేందుకు స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రభుత్వం బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేయిస్తోంది.

  • Share this:
    మహిళలు తమకాళ్లపై తాము నిలబడేందుకు స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రభుత్వం బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేయిస్తోంది. దీంతో మహిళలు వ్యాపారాలు, కుటీర పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. దేశవ్యాప్తంగా డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలు పొదుపు చేసేలా ప్రోత్సహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని స్వయం సహాయక సంఘాలు దేశంలోని అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా స్వయం సహాయక బృందాలపై నాబార్డు రూపొందించిన నివేదికలో ఏపీ మహిళలు సాధించిన ఘనతలు వెల్లడయ్యాయి. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో ఏపీకి చెందిన స్వయం సహాయక సంఘాలు.. పొదుపులో దక్షిణాది రాష్ట్రాల్లో నెంబర్ వన్ గా నిలిచాయి. 2020–21కి వచ్చేసరికి ఏకంగా దేశంలోనే టాప్ ప్లేస్ సాధించాయి స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని అధికారులు చెప్తున్నారు.

    రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలు పొదుపు పెంచడంలోనే కాదు.. అప్పులు తగ్గించుకోవడంలోనూ ముందున్నారు. 2019–20 ఆర్ధిక సంవత్సరంతో పోల్చితే 2020-21లో ఆంధ్రప్రదేశ్‌ మహిళా సంఘాల పొదుపు ఏకంగా రూ.4,153.37 కోట్ల మేర పెరిగింది. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పొదుపులో 29.17 శాతం. అలాగే అప్పులు అప్పులు కూడా రూ.5,940.97 కోట్ల మేర దిగివచ్చాయి. 2019-20లో రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల క్రెడిట్‌ లింకేజీ 61.9 శాతం ఉండగా… 2020–21లో 69.12 శాతానికి పెరిగినట్లు నాబార్డు నివేదికలో పేర్కొంది.

    ఇది చదవండి: ఇన్ స్టాగ్రామ్ లో 350 మంది అమ్మాయిలకు వల… క్లోజ్ గా చాట్ చేసి ముగ్గులోకి దించాడు.. ఆ తర్వాత...



    ఆంధ్రప్రదేశ్ లో 10లక్షల 58వేల పొదుపు సంఘాలుండగా… అన్నింటికి కలిపి రూ.10,933.04 కోట్ల పొదుపు సొమ్ము ఉంది. అలాగే 4,16,621 స్వయం సహాయక సంఘాలకు రూ.14,609.84 కోట్ల మేర బ్యాంక్ రుణాలున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే డ్వాక్రా సంఘాల పొదుపు పెరగడంతో పాటు అప్పులు కూడా తగ్గినట్లు ప్రభుత్వ వర్గాలంటున్నాయి.  ముఖ్యంగా వైఎస్ఆర్ ఆసరా,చేయూత పథకాల వల్ల మహిళల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయడం వల్ల ఆ డబ్బుతో డ్వాక్రా రుణాల వాయిదాల చెల్లింపు సులభతరమైనట్లు చెబుతున్నారు.

    ఇది చదవండి: ఏపీలో మాస్క్ లేకుంటే రూ.20వేలు ఫైన్... ప్రభుత్వం కీలక ఉత్తర్వులు... ఎవరికంటే...!

    ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విడతలో 87.74 లక్షల మంది మహిళలకు రూ.6,792.21 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో వేశారు. అలాగే సకాలంలో రుణాలు చెల్లించిన గ్రూపులకు చెందిన 87 లక్షల మందికి పైగా మహిళలకు సున్నా వడ్డీ కింద 2019-20లో రూ.1,400.8 కోట్లను చెల్లించారు. 2020-21లో సున్నా వడ్డీ కింద 1.02 కోట్ల మంది మహిళలకు రూ.1,109 కోట్లను ప్రభుత్వం చెల్లించింది.
    Published by:Purna Chandra
    First published: