Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH SEC ACTION ON YSRCP MLA JOGI RAMESH ORDERED WILL NOT SPEAK TO MEDIA TILL COMPLETION OF PANCHAYAT ELECTIONS AK

AP Panchayat Elections: వైసీపీ ఎమ్మెల్యేపై ఎస్ఈసీ సీరియస్.. కీలక ఆదేశాలు

పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ (ఫైల్)

పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ (ఫైల్)

AP Panchayat Elections: కృష్ణా జిల్లా పెడన రూరల్ మండలంలోని మునిపెడ గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం చేసిన స్థానిక ఎమ్మెల్యే జోగి రమేష్.. బహిరంగసభలోనే ఘాటు వ్యాఖ్యలు చేశారు.

    వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఈ నెల 17న ఎన్నికలు పూర్తయ్యే వరకు మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. సభలు, సమావేశాలు, ప్రచారాల్లో మాట్లాడకూడదని ఎస్‌ఈసీ ఆదేశాల్లో తమ ఆదేశాల్లో పేర్కొంది. ఉత్తర్వులు అమలు చేయాలని కలెక్టర్‌, ఎస్పీలకు స్పష్టం చేసింది. జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎస్ఈసీకి ఫిర్యాదు చేసింది. జోగి రమేష్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని నిర్ధారించిన ఎస్ఈసీ.. పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆయన మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. ఎస్‌ఈసీ పేర్కొంది.

    అంతకుముందు మీడియాతో మాట్లాడిన వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్లు వేస్తే పథకాలు కట్ చేస్తామంటూ ప్రజలను హెచ్చరించారు. కృష్ణాజిల్లా పెడన రూరల్ మండలంలోని మునిపెడ గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం చేసిన స్థానిక ఎమ్మెల్యే జోగి రమేష్.. బహిరంగసభలోనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీకి ఎవరైనా నామినేషన్లు వేస్తే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. బహిరంగ సభలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఎవరైనా వైఎస్ఆర్సీపీ కాకుండా.. వేరే పార్టీ తరపున వార్డు మెంబర్ గా నిలబడితే ఊరుకునే ప్రసస్తే లేదన్నారు జోగి రమేష్. జగనన్న ఇస్తున్న పథకాలు తీసుకుంటూ వేరే పార్టీల్లో పోటీ చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని.., పెన్షన్, కాపునేస్తం అమ్మఒడి, ప్రతి పథకాన్నీ కూడా కట్ చేసిపారేస్తామని అందులో మొహమాటం లేదంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన ఎస్ఈసీ.. . ఈ నెల 17న ఎన్నికలు పూర్తయ్యే వరకు మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Gram Panchayat Elections, Jogi Ramesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు