Viral Video: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సొంత జిల్లా కడప (Kadapa) లో ఓ యువకుడి వినూత్న ప్రదర్శన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ జగన్ అన్నా కాపాడు అంటూ.. బురదలో పొర్లు దండాలు పెడుతూ వినూత్నంగా నిరసనకు దిగాడు. ఈ నిరసనే కాదు.. చాలా రోజుల నుంచి ఏపీలో రోడ్ల పరిస్థితిని (AP Roads) ఎత్తి చూపుతూ సోషల్ మీడియా (Social Media) లో నిరసన వెల్లువెత్తుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీ (Janasna Party) తో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం (Telugu Desham) డిజిటల్ ఉద్యమం చేపట్టడంతో ఏపీలో రోడ్లు ఇంత దారుణంగా ఉన్నాయా అనే చాలా జరుగుతోంది. చాలా రోజు లనుంచి ఏపీలో రోడ్లపై రచ్చ ఆగడం లేదు. రోడ్ల పరిస్థితిపై సోషల్ మీడియాలో జోకులు, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. రోడ్లపై గుంతలతో జనాలు పడుతున్న బాధకు కాస్త కామెడీ టచ్ ఇస్తున్నారు నెటిజన్లు. అయితే తాజాగా ఓ యువకుడు సీఎం సొంత జిల్లాలో వినూత్న నిరసనలు చేపట్టడం వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం కొత్త బస్వాపురం గ్రామంలో రహదారి సౌకర్యం లేదంటూ ఓ యువకుడు ఇలా నిరసనకు దిగాడు.
రాజేష్ అనే వ్యక్తి బురదమయమైన రహదారిలో పొర్లు దండాలు పెడుతూ.. సీఎం జగన్ స్పందించి తమ గ్రామంలో రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతూ ఇలా నిరసన చేపట్టాడు. అతడికి గ్రామస్తులు కొందరు సహకరించారు. ఇక ఈ నిరసనపై టీడీపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ కల్లా రోడ్లపై ఒక్క గుంత కనపడకూడదంటూ మూడేళ్లుగా మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతీ ఏటా ఇచ్చే స్టేట్మెంట్లో ఒక్క అక్షరమూ మారలేదంటూ నారా లోకేష్ ట్విట్టర్ లో మండిపడ్డారు.
వచ్చే ఏడాది జనవరి 1 కల్లా రోడ్లపై ఒక్క గుంత కనపడకూడదంటూ మూడేళ్లుగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు ప్రతీ ఏటా ఇచ్చే స్టేట్మెంట్లో ఒక్క అక్షరమూ మారలేదు. రోడ్ల దుస్థితీ మారలేదు.(1/4)#ChatthaRoadsChatthaCM #APRoads #WorstRoads pic.twitter.com/4a2wjpTm90
— Lokesh Nara (@naralokesh) September 9, 2022
ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడమే తెలిసిన వైసీపీ నేతలకు.. ఇది ప్రభుత్వంపై బురద చల్లే కుట్ర అని సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసి బురదని ఫోరెన్సిక్కి పంపి, పొర్లుదండాలు మార్ఫింగ్ అని ప్రెస్మీట్ పెట్టొద్దు ప్లీజ్ అంటూ సెటైర్లు వేశారు.
ఇదీ చదవండి : మరో మూడు రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఏ జిల్లాలపై ఎంత ప్రభావం ఉంటుంది..?
ప్రతిదానికీ బటన్ నొక్కుతున్న సీఎం.. ఈ దరిద్రపు రోడ్లు బాగు అయ్యేలా ఒకసారి బటన్ నొక్కితే గ్రామస్తులకి ఈ బురదలో పొర్లుదండాలు పెట్టే బాధ ఉండదు.. నిరసన తెలిపేవారిపై తప్పుడుకేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేయాల్సిన టాస్క్ సీఐడీకి తప్పుతుంది అంటున్నారు సీఎం జగన్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Kadapa, Road safety