హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి.. ఆనందయ్య మందుపై వివాదం..

Andhra Pradesh: రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి.. ఆనందయ్య మందుపై వివాదం..

ఇటీవల ఆనందయ్య దగ్గర నుంచి చుక్కలు మందు తీసుకున్న హెడ్ మాస్టర్ కోటయ్య మరణించడంతో.. ప్రభుత్వం రిస్క్ చేసేందుకు సిద్ధంగా లేదని.. వైసీపీ వర్గాలు అంటున్నాయి.. దీంతో చుక్కల మందు పంపిణీ ఇప్పట్లో ఉండకపోవచ్చు..ఆనందయ్య కంట్లో వేసే ముందుకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక వేరే కారణముందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల కోట మండ‌లం తిన్నెలపొడికి చెందిన కోట‌య్య అనే రిటైర్డ్ హెడ్‌మాస్ట‌ర్‌.. ఆనందయ్య దగ్గర కంట్లో చుక్కలు వేసుకుని బ్రతికానన్న వీడియోతో అప్ప‌ట్లో వైర‌ల్‌గా మారిపోయింది.. కంట్లో చుక్కల మందు వేసుకున్న వారం రోజులకు ఆరోగ్యం క్షిణించి కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కోటయ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం 22న నెల్లూరు జిజిహెచ్ కి త‌ర‌లించారు. వారం రోజుల నుండి చికిత్స పొందుతూ నెల్లూరు జిజిహెచ్ లో ఇవాళ మ‌ర‌ణించారు కోటయ్య. దీంతో కంట్లో వేసే మందుకు అనుమతి ఇవ్వకపోయి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది..

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతిచెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో నేడు తుదిశ్వాస విడిచారు.

  ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతిచెందారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. పదిరోజుల క్రితం కరోనాతో కోటయ్య.. నెల్లూరు జీజీహెచ్‌లో చేరారు. కరోనా సోకిన తర్వాత కోటయ్య.. తొలుత కృష్ణపట్నం ఆనందయ్య మందు తీసుకున్నారు. అనంతరం తాను కోలుకున్నట్టు కోటయ్య ఓ వీడియోలో చెప్పారు. దీంతో ఆనందయ్య మందు గురించి చాలా మందికి తెలిసింది. ఆ తర్వాత ఆనందయ్య మందుకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. చాలా మంది ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నానికి బారులు తీరారు. దీంతో దేశవ్యాప్తంగా ఆనందయ్య మందుపై చర్చ మొదలైంది. అయితే ఆనందయ్య మందు తీసుకన్న రెండు రోజుల అనంతరం ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో కోటయ్య.. ఆస్పత్రిలో చేరారు.

  ఆనందయ్య మందుతో కోలుకున్నానని చెప్పిన కోటయ్య.. ఇప్పుడు మృతిచెందడంపై భిన్నాభిప్రాయాలు వినిసిప్తున్నాయి. కొందరు ఆనందయ్య మందు వల్లే కోటయ్య చనిపోయారని ఆరోపిస్తున్నారు. మరికొందరు మాత్రం కోటయ్య చనిపోవడానికి అనారోగ్య సమస్యలే కారణమని అంటున్నారు. ఏది ఏమైనా కోటయ్య మరణం.. చాలా మందిని షాక్‌కు గురిచేసింది. తాజా పరిణామాలతో ఆనందయ్య మందుపై మరోసారి విపరీతమైన చర్చ జరుగుతోంది.

  ఇక, ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. చాలా మంది ఆనందయ్య మందు పంపిణీకి ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఆనందయ్య మందుతో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని ఆయుష్ అధికారులు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మందుకు సంబంధించి CCRAS నివేదిక రావాల్సి ఉంది. ఈ నివేదికలో ఆనందయ్య మందు గురించి ఏం చెప్తారనే ఉత్కంఠ చాలా మందిలో నెలకొంది. మరోవైపు ఆనందయ్య మందు పంపిణీపై నేడు హైకోర్టులో విచారణ జరుగుతోంది.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Anandaiah corona medicine, Covid-19, Nellore

  ఉత్తమ కథలు