ఏపీలో మందుబాబులకు మరో షాక్..

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం మరో షాకింగ్ న్యూస్ ఇచ్చింది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం మరో షాకింగ్ న్యూస్ ఇచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే 75 శాతం మద్యం ధరలు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. అయినా కూడా లిక్కర్ కోసం ప్రజలు ఎగబడ్డారు. కానీ, రెండో రోజు ఆ పరిస్థితి లేదు. రద్దీ తగ్గింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లిక్కర్ షాపులను 33శాతం మేర తగ్గింది. రాష్ట్రంలో వాస్తవానికి 4380 లిక్కర్ షాపులు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేవి. వాటిని 3500కు గతంలోనే తగ్గించారు. ఇప్పుడు వాటిని 2934కు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తెచ్చేదిశగా ముందుకు వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మద్యం దుకాణాలను తగ్గించినట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటన జారీ చేసింది. తగ్గించిన షాపుల్లో ఏ జిల్లాల్లో ఎన్ని దుకాణాలను తగ్గించారు, ఏయే దుకాణాలను తగ్గించారనే వివరాలను ప్రభుత్వం త్వరలో తెలియజేయనుంది.

  ఏపీలో లిక్కర్ షాపుల సంఖ్య తగ్గిస్తూ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు


  లిక్కర్ షాప్‌లు తెరచుకోవడంలో మద్యం బాబుల సంబరం అంతా ఇంతా కాదు. షాపుల తెరవక ముందే ఉదయం నుంచి క్యూ కడుతున్నారు. మద్యం దుకాణాల ముందు కిలోమీటర్ల మేర బారులు దీరుతున్నారు. సామాజిక దూరం పాటించాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. గుంపులు గుంపులుగా ఎగబడి మద్యం కోసం యుద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ అధికారులు కొత్త కండిషన్ తీసుకొచ్చారు. మద్యం కావాలంటే మాస్క్‌తో పాటు గొడగు తప్పనిసరి ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు గొడుగు పట్టుకుంటే.. కాస్త దూరం దూరంగా నిలబడాల్సి వస్తుంది. అప్పుడు సహజంగానే భౌతిక దూరం పాటిస్తారు. ఈ క్రమంలోనే గొడుగు నిబంధన తీసుకొచ్చారు అధికారులు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: