AP Rains: ఏపీ వెదర్ రిపోర్టు, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ప్రతీకాత్మక చిత్రం

AP Weather Report | ఉత్తరాంధ్రలో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

  • Share this:
    Rains in Andhra Pradesh |  పశ్చిమ మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న తూర్పు రాజస్థాన్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. ఉత్తర-దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు 1.5 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన ఇలా ఉంది. ఉత్తరాంధ్రలో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: