ఏపీలోని ఈ మూడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన ఇలా ఉంది.

news18-telugu
Updated: August 16, 2020, 4:26 PM IST
ఏపీలోని ఈ మూడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దక్షిణ ఝార్ఖండ్, దానిని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళే కొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది ఇది రాగల 24 గంటలలో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలహీనపడే అవకాశం ఉంది. తూర్పు-పశ్చిమ shear zone Lat.19.0 deg.N వెంబడి పెనిన్సులర్ భారతదేశం మీదుగా 4.5 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళే కొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో సుమారుగా ఆగస్టు 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :

ఉత్తర కోస్తాంధ్ర, యానాం :
ఈ రోజు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈ రోజు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. కృష్ణ జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ :

ఈ రోజు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 16, 2020, 4:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading