Heavy Rains in AP: ఏపీకి భారీ వర్ష హెచ్చరిక, ఈ రెండు జిల్లాలకు స్పెషల్ వార్నింగ్

AP Rains Alert: ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఈరోజు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడింది.

news18-telugu
Updated: September 20, 2020, 5:18 PM IST
Heavy Rains in AP: ఏపీకి భారీ వర్ష హెచ్చరిక, ఈ రెండు జిల్లాలకు స్పెషల్ వార్నింగ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఈరోజు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొలది నైరుతీదిశ వైపునకు వంపు తిరిగి ఉన్నది. రాగల 24 గంటలలో ఇది వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. రాగల 2-3 రోజులలో ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఇక తూర్పు-పశ్చిమ shear zone 16°N Latitude వెంబడి పెనిన్సులర్ భారతదేశం మీదుగా 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్లేకొలది పైన తెలిపిన అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మీదుగా దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం బలహీనపడింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :

ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేకచోట్ల కురిసే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈరోజు దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ :
ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 20, 2020, 5:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading