Andhra Pradesh Rain Alert: రానున్న నాలుగైదు గంటల్లో ఏపీలో భారీ వర్షాలు...

Andhra Pradesh Rain Alert: రానున్న నాలుగైదు గంటల్లో ఏపీలో భారీ వర్షాలు...

ప్రతీకాత్మక చిత్రం

రానున్న నాలుగైదు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వాహణ శాఖ తెలిపింది. రానున్న కొన్ని గంటలకు(4 నుంచి 5 గంటల వరకు) ఏపీలో వర్షసూచనను విడుదల విపత్తు నిర్వహణ శాఖ విడుదల చేసింది.

  • Share this:
    రానున్న నాలుగైదు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వాహణ శాఖ తెలిపింది. రానున్న కొన్ని గంటలకు(4 నుంచి 5 గంటల వరకు) ఏపీలో వర్షసూచనను విపత్తు నిర్వహణ శాఖ విడుదల చేసింది. IMD శాటిలైట్, డీడబ్ల్యూఆర్ అబ్జర్వేషన్ ప్రకారం.. తమిళనాడు తీర ప్రాంతానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతం మీద ఉన్న అల్పపీడన ద్రోణి బలహీన పడిందని తెలిపింది. తమిళనాడు తీరం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి 3.1 కి.మీ ఎత్తు వరకు ఇది విస్తరించిందని చెప్పింది.

    ఈ ప్రభావంతో రానున్న నాలుగైదు గంటలపాటు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు, అనంతపూర్ జిల్లాలోని పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది. తాము పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నామని.. ప్రజలకు నిరంతంరం అప్‌డేట్స్ అందజేస్తామని విపత్తు నిర్వాహణ శాఖ తెలిపింది.
    Published by:Sumanth Kanukula
    First published: