ఏపీలో పెరిగిన పోలింగ్ వైసీపీకి కలిసొస్తుందా... టీడీపీకి మేలు చేస్తుందా...

AP Assembly Election 2019 : తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత పోలింగ్ పెరిగితే ఎలా అర్థం చేసుకోవాలన్నది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులకు సమస్యగా మారింది. ఓటరు నాడిని గుర్తించడం కష్టమవుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: April 28, 2019, 9:08 AM IST
ఏపీలో పెరిగిన పోలింగ్ వైసీపీకి కలిసొస్తుందా... టీడీపీకి మేలు చేస్తుందా...
చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్
  • Share this:
సహజంగా ఎక్కువ పోలింగ్ జరిగితే... ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోయిందనీ, ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న కసితో ఎక్కువ మంది వచ్చి ఓటు వేశారని లెక్కలు చెబుతుంటారు రాజకీయ విశ్లేషకులు. ఐతే... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పోలింగ్ జరిగితే... ఫలితాలు వచ్చాక తేలిందేంటి. ప్రభుత్వంపై నమ్మకం పెరగడంతో... ఎక్కువ మంది టీఆర్ఎస్‌కి ఓటు వేసి... తిరిగి అదే ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నట్లైంది. మరి ఏపీలో సంగతేంటి? అక్కడ 2014లో కంటే ఈసారి 1.68 శాతం ఎక్కువ పోలింగ్ జరిగింది. తమ పాలన నచ్చింది కాబట్టే... మహిళలు, ముసలివాళ్లు... రాత్రంతా జాగారం చేసి మరీ తమకు ఓట్లు వేశారని టీడీపీ నేతలు చెప్పారు. ప్రభుత్వాన్ని గద్దె దింపాలని డిసైడయ్యారు కాబట్టే ప్రజలు రాత్రంతా జాగారం చేసి మరీ తమకు ఓట్లు వేశారని వైసీపీ నేతలు అన్నారు. నిజానికి 1952 నుంచీ గమనిస్తే... పోలింగ్ పెరగడానికీ, ప్రభుత్వ వ్యతిరేకతకూ సంబంధం ఉన్నట్లు పెద్దగా కనిపించట్లేదు. పోలింగ్ పెరిగిన ప్రతిసారీ ప్రభుత్వాలు పడిపోలేదు. అలాగని పోలింగ్ తగ్గిన ప్రతిసారీ ప్రభుత్వాలు తిరిగి అధికారంలోకి వచ్చింది కూడా లేదు. ప్రజలు ఓటు వేసేటప్పుడు పరిపాలనతోపాటూ స్థానిక అంశాలు, కులం, మతం, భావోద్వేగాలు, అభ్యర్థి గుణగణాలూ అన్నీ లెక్కలోకి తీసుకొనే ఓటు వేస్తున్నారని గణాంకాల ద్వారా తెలిసింది.

ఏపీలో 1978లో 13.21 శాతం పోలింగ్ పెరిగింది. అప్పట్లో అధికారంలో కాంగ్రెస్ ఉండగా... తనను బహిష్కరించిన కాంగ్రెస్‌కి పోటీగా ఇందిరాగాంధీ... ఇందిరాకాంగ్రెస్ అనే సొంత పార్టీ పెట్టుకొని... తిరుగులేని విజయం సాధించారు. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత కంటే... ఇందిరాగాంధీపై ఉన్న అభిమానం, ఆమె అరెస్టుతో ఏర్పడిన భావోద్వేగమే ప్రజలను కదిలించింది. ఇది ఒక్కటీ తప్పితే... పోలింగ్ పెరగడం వల్ల ప్రభుత్వం పడిపోయిన సందర్భాలు లోక్ సభ చరిత్రలో లేవు.

1983లో ఎన్టీఆర్ రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టించి... కాంగ్రెస్‌ను గద్దె దింపారు. ఐతే... ఈ ఎన్నికల్లో పోలింగ్ 5.22 శాతం తక్కువే వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ను నాదెండ్ల బర్తరఫ్ చేసినప్పుడు... ఎన్టీఆర్‌ పై సానుభూతి పెరిగినా... అప్పుడు జరిగిన ఎన్నికల్లో పోలింగ్ 0.13 శాతం తగ్గింది. 1989 ఎన్నికల్లో టీడీపీని ఓడించి కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు పోలింగ్ 2.87 శాతం పెరిగింది. కానీ 1994లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు పోలింగ్ 0.58 శాతమే పెరిగింది. నిజానికి అప్పుడు కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత అత్యంత ఎక్కువగా ఉంది. ఆ లెక్కన పోలింగ్ కనీసం 5 శాతమైనా పెరగాలి. అలా జరగలేదు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా... పోలింగ్ 0.7 శాతమే పెరిగింది. 2009లో పోలింగ్ 1.87 శాతం పెరగ్గా... తిరిగి కాంగ్రెస్సే విజయం సాధించింది. 2014లో మాత్రం పోలింగ్ 5.59 శాతం పెరిగింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు కాంగ్రెస్‌ను సాగనంపారు.


ఇప్పుడు పోటీ మొత్తం టీడీపీ, వైసీపీ మధ్య ఎక్కువగా సాగింది. మధ్యలో జనసేన ఉన్నప్పటికీ ఆ పార్టీ ప్రభావం ఎలా ఉంటుంది అన్న దాని కంటే... టీడీపీ, వైసీపీ విషయంలో ఓటర్లు ఎలా స్పందించారన్నదాన్నీ బట్టీ... ఎవరు అధికారంలోకి వచ్చేదీ డిసైడవుతుందంటున్నారు. అందువల్ల పోలింగ్ సరళిని బట్టీ... ఎవరు అధికారంలోకి వచ్చేదీ నిర్ణయం తీసుకోవడం కరెక్టు కాకపోవచ్చంటున్నారు.ఇవి కూడా చదవండి :

మే 26న జగన్ ఏపీ సీఎంగా ప్రమాణం చేస్తారా... ఆ రోజే మంచిదంటున్న జ్యోతిష్యులు... ఎందుకంటే...

వైసీపీ, టీడీపీ... ఏపీలో ఎవరు గెలిచినా అప్పుల తిప్పలే... సీఎం సీటు ముళ్ల కిరీటమే... బిల్లుల భారమేఉత్తరాంధ్రలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ... ప్రభావం చూపిస్తున్న జనసేన...

పవన్ కళ్యాణ్ బాటలో నాగబాబు... జబర్దస్త్ విషయంలో ఏమన్నారంటే...
Published by: Krishna Kumar N
First published: April 28, 2019, 7:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading