YCP MLA: జగన్‌ను హతమార్చేందుకు కుట్ర జరుగుతోంది.. అధికార పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు
వైఎస్ జగన్
Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల వాతావరణ కనిపిస్తోంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు హద్దులు దాటుతున్నాయి. నువ్వొకటంటే నేను రెండు అంటాను అనే రేంజ్ లో తిట్ల దండకం కొనసాగుతోంది. తాజాగా ఓ వైసీపీ నేత సంచలన ఆరోపణలు చేశారు.. సీఎం జగన్ ను హతమార్చేందుకు కుట్ర జరుగుతోంది అన్నారు.
Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు చేయడంలో చేయడంలో తగ్గెదే లే అంటున్నారు ఇరు పార్టీల నేతలు. తాజాగా ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government) తీరుపై చంద్రబాబు నాయుడు డు (Chandrababu naidu)తీవ్ర విమర్శలు చేశారు. ఏపీకిప్రత్యేక హోదా (Special status),విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha steel Plant) ప్రైవేటీకరణ, రైల్వే జోన్ (railway zone) హోదా విషయాల్లో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ ప్రభుత్వం తీరు సరిగా లేదన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తారా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అయితే ఇదే సమంలో వైసీపీ నేత సంచలన ఆరోపణలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు..
అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నేతలు ఈ కుట్రకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. జగన్ ను హత్య చేసి అయినా.. అధికారంలోకి రావాలని టీడీపీ భావిస్తోందన్నారు. అందుకు ఇటీవల వదర ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అన్నారు. సీఎం జగన్ గాల్లో వచ్చి.. గాల్లోనే కలిసిపోతారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారని అప్పటి వ్యాఖ్యలు గుర్తు చేశారు. అంతేకాదు సీఎంను జైలుకు పంపేందుకు టీడీపీ కుట్ర పన్నుతోందని ఆయన అన్నారు.
అలాగే మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వంశీ, అంబటిలను చంపితే 50 లక్షల రూపాయలు ఇస్తానని కమ్మ సంఘం నేత మల్లాది వాసు అనడంపైనా మండిపడ్డారు. ఆ మాటలు ఎక్కడో చెబితే అనంతపురంలో ఫ్లెక్సీలు కడుతున్నారన్నారు. ఇదే టీడీపీ విధానమా? అలా కాకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ సహా టీడీపీ నేతలెవరూ మల్లాది వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు? హింసా రాజకీయాలకు కేరాఫ్‌గా టీడీపీ, స్కాంలకు కేరాఫ్‌గా చంద్రబాబు మారారని మండిపడ్డారు.
చంద్రబాబు పాలనలో వేల కోట్ల ప్రజాధనం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లిపోయిందన్నారు. స్కిల్ డవలప్ మెంట్ పేరుతో భారీగా కోట్లు నొక్కేసారని ఆరోపించారు. ఒకవేళ ఇది అబద్ధమైతే సీఐడీ విచారణకు ఆ పార్టీనేతలు ఎందుకు అడ్డుపడుతున్నారో వివరించాలి అన్నారు. జగన్ ను హత్య చేసైనా అధికారంలోకి చేజిక్కించుకోవాలని టీడీపీ చూస్తోందని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.