ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు కొద్ది రోజులుగా గంజాయి స్మగ్లింగ్ (Smuggling), డ్రగ్స్ ఆరోపణల చుట్టూనే తిరుగుతున్నాయి. రాజకీయ నేతలు, ఆరోపణల మధ్యలో పోలీసులు జోక్యం చేసుకోవడం పరిస్థితిని మరింత తీవ్రంగా మారుస్తోంది. గంజాయి స్మగ్లింగ్, డ్రగ్ ఆరోపణలతో సోమవారం ఉదయం పట్టాభి నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు విశాఖ (Vishaka) నర్సీపట్నం పోలీసుల నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటి తరువాత విజయవాడలో ఉన్న ఆయన నివాసంలో, ఏపీలోని మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం సహా వివిధ జిల్లాలోని టీడీపీ ఆఫీసులపై వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి.
గొడవకు కారణం..
గంజాయి స్మగ్లింగ్ వ్యవహారంలో వైసీపీ నేతలపై నక్కా ఆనంద్ బాబు పలు విమర్శలు చేశారు. దీనిపై ర్సీపట్నం పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు అర్ధరాత్రి ఇంటికి వెళ్లారు.
Andhra Pradesh : బీసీ కుల గణనపై పెరుగుతున్న డిమాండ్లు.. ఎందుకోసం?
అనంతరం సోమవారం ఉదయం మీడియాతో ఆయన మాట్లాడారు. పోలీసులను గుప్పిట్లో పెట్టుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇదంతా చేయిస్తున్నారని.. గంజాయి వ్యవహారంపై మాట్లాడకుండా బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు.
ప్రణాళికతో చేశారని అనుమానం..
దీంతో ఆగ్రహానికి లోనైన వైసీపీ (YCP) కార్యకర్తలు వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డట్లుగా సమాచారం. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా మూకుమ్మడిగా ఒకే సారి నిరసనలు.. టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరగడంతో ప్రణాళికతోనే చేశారని టీడీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
Badvel By-Poll : బద్వేల్ బల పరీక్ష.. ఎవరికి లబ్ధి
అంతే కాకుండా అందరికీ ఒకే సారి దాడులు చేయాలని సమాచారం పంపారని.. అడ్డుకోవద్దని పోలీసులకు కూడా ఆదేశాలిచ్చారని.. పోలీసులు పాటించారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.
అమిత్‌షాకు చంద్రబాబు ఫోన్..
ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)కు చంద్రబాబు ఫోన్ చేసినట్టు సమాచారం. టీడీపీ నేతలు, కార్యాలయాలపై పక్కా ప్రణాళిక ప్రకారం దాడులు చేయిస్తున్నారని అమిత్ షాకు చంద్రబాబు తెలిపనట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ద్వారా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అమిత్ షా పేర్కొన్నట్టు సమాచారం. టీడీపీ కార్యాలయానికి కేంద్ర భద్రతాబలగాల రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, TDP, Ysrcp