టీడీపీ, వైపీసీ, జనసేన తొలి జాబితాలు రెడీ... నేడు రిలీజ్?

జగన్, చంద్రబాబు, పవన్ (File)

AP Assembly Elections 2019 : ఎన్నికలకు టైం దగ్గర పడుతుంటే... పార్టీల నేతలకు ఊపిరాడట్లేదు. ఎలాగొలా తొలి జాబితా రిలీజ్ చేసేయడానికి రెడీ అయ్యారు.

  • Share this:
75 మందితో వైసీపీ తొలి జాబితా : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే తమ అభ్యర్థుల తొలి జాబితాను నేడు ఉదయం 10.25కి ప్రకటించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ నిర్ణయించారు. అధికార పక్షం టీడీపీ సహా... ఇతర రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలకు ఫైనల్ టచ్ ఇస్తున్న టైంలో టీడీపీ నుంచి వచ్చే పేరున్న అభ్యర్థుల కోసం ఎదురు చూస్తూ ఉండిపోకుండా... తమ అభ్యర్థులపై స్పష్టత ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో లోతుగా చర్చించారు. లోక్‌సభ అభ్యర్థుల్ని కూడా ఇవాళ ప్రకటిస్తారని తెలిసింది. అసెంబ్లీకి సంబంధించి తొలి జాబితా 75 మంది పేర్లుంటాయని తెలిసింది. ఆ తర్వాత రోజుకు 25 మంది చొప్పున 3 రోజుల పాటు మరికొందరు పేర్లు రిలీజ్ చెయ్యబోతున్నారు. టైం ఎక్కువ లేకపోవడంతో... బస్సు యాత్ర రద్దుచేసుకున్న జగన్... హెలికాప్టర్‌‌లో పర్యటిస్తూ ప్రచారాలకు వెళ్లాలని నిర్ణయించారు.

టీడీపీ తొలి జాబితాలో 100కు పైగా అభ్యర్థులు : టీడీపీ అధినేత చంద్రబాబు... 100కు పైగా అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని ఫైనల్ చేశారు. ఈ జాబితాను ఇవాళో, రేపో విడుదల చేసే అవకాశాలున్నాయి. ఏప్రిల్ 11న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో... ప్రచారం చేసుకునేందుకు సరిగ్గా 28 రోజులు మాత్రమే ఉండటంతో... గెలుపు గుర్రాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. జిల్లాలవారీగా అభ్యర్థుల ఎంపికల్లో తలమునకలయ్యారు. ఎన్నిల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టిన చంద్రబాబు.. నియోజకవర్గాలవారీగా అభ్యర్థుల బలాబలాలపై నేతలతో చర్చించారు. మొదటి జాబితాను ఫైనల్ చేసిన చంద్రబాబు... పెండింగ్ నియోజకవర్గాలపై కసరత్తు చేస్తున్నారు. అసంతృప్తుల్ని బుజ్జగిస్తూ... అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో ఉన్నారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తొలి జాబితా ఇవాళ బయటికొచ్చే అవకాశాలున్నాయి.

32 మందితో జనసేన తొలి జాబితా : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలనుకుంటున్న జనసేన... అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను సిద్ధం చేసింది. పార్టీ జనరల్ బాడీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసి... 32 అసెంబ్లీ స్థానాలకు, 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఫైనల్ చేశారు. తొలి జాబితాను ఇవాళో, రేపో విడుదల చేస్తారని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత కోసం ఈ పార్టీ సరికొత్త పంథాను ఎంచుకుంది. టికెట్ల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చంటూ అందరికీ స్వేచ్ఛను ఇచ్చారు పవన్ కళ్యాణ్. పార్టీలో సీనియర్లుగా ఉన్న మాదాసు గంగాధరం, శ్రీ అర్హం ఖాన్, మహేందర్ రెడ్డి, హరిప్రసాద్, శివశంకర్ వంటి నేతలతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ విజయవాడ కార్యాలయంలో దరఖాస్తుల్ని స్వీకరించి.. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తోంది.

 

ఇవి కూడా చదవండి :

నేతల జంపింగ్ జపాంగ్... తాజాగా ఎవరు ఏ పార్టీల్లోకి...

Ind vs Aus 5th ODI : ఢిల్లీలో భారత్ ఆస్ట్రేలియా ఐదో వన్డే... గెలిచిన జట్టుదే సిరీస్

శనగపిండి షర్బత్ ట్రై చేశారా... ఎండాకాలంలో తాగాల్సిన డ్రింక్

పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు తింటున్నారా... 21 ఆరోగ్య ప్రయోజనాలు
First published: